తాడేపల్లి : పెనుమాక రైతుల సమస్యలను తెలుసుకుని వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పథకం ప్రకారమే హత్యాయత్నానికి పాల్పడ్డారని తాడికొండ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. పెనుమాక గ్రామ రైతుల భూముల భూసేకరణ సమస్యలపై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వైయస్ఆర్‌సీపీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీ సభ్యులుగా మేము వెళ్తున్న సమయంలో, ఈ నెల 27వ తేదీన ఉదయం ఉండవల్లిలోని అమ్మా హోటల్ సమీపంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు వంద మంది వ్యక్తులు ముందస్తు కుట్రతో మమ్మల్ని అడ్డగించారు. కర్రలు, రాళ్లు, కత్తులు తదితర మారణాయుధాలతో మా బృందంపై మూకుమ్మడిగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. మమ్ములను చంపే ప్రయత్నం ఉండవల్లి కి చెందిన దాసరి కృష్ణ @ అమ్మా హెూటల్ కృష్ణ, మామిడిసత్యనారాయణ @ పాలకొల్లు సత్తిగాడు, గాదె బసివి రెడ్డి, సనకం బుజ్జి వంగవీటి నరేంద్ర, కూనపురెడ్డి రమేష్, బొబ్బారవితేజ, తోట సాంబశివరావు పెనుమాక గ్రామానికి చెందిన కొల్లి శేషు, కొంత మంది మహిళలు మా ప్రతినిధుల బృందం పైమూకుమ్మడిగా కర్రలు, కత్తులు, రాళ్ళు మరియు కోడి గుడ్లు తోదాడిచేసి నా పై మరియు మా సభ్యులపై పోలీసు వారిపై విచక్షణ రహితంగా కొట్టగా మేము ప్రాణాలు అరచేతిలో పెటుకుని తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాము. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి కారును ధ్వసం చేశారు. పోలీసుకు బండరాయి తగిలి స్పృహ కోల్పోయినారు. పైన తెలిపిన వారందరూ ఉద్దేశ్య పూర్వకంగా, కుట్రతో మాపై మారణాయుధాలతో దాడి చేసి కొట్టి బెదిరించి, అసభ్య పదజాలంతో దూషించి చంపేప్రయత్నం చెయ్యడమే కాకుండా అక్కడ ఉన్న వారందరూ ఉద్దేశ్య పూర్వకంగా అందరూ చూస్తుండగా పైన పేర్కొన్న వ్యక్తులు మమ్ములను అడ్డగించి చట్ట విరుద్ధంగా అల్లర్లు సృష్టించాలని దురుద్దేశంతో మాల మాదిగ నాకొడకల్లారా అమరావతి రైతులతో మీకెంపనిరా మీ అంతు చూస్తాం " అని కోపంతో మాపై దాడి చేసి కించపరిచే విధంగా మాట్లాడటమే కాకుండా నాతో పాటు వచ్చిన వ్యక్తులపై దాడిచేసి ఎమ్మెల్సీల కారు అద్దాలు పగులగొట్టి నన్ను నాతోవచ్చిన వారిపై హత్యాయత్నం చేయగా నాకు నాతో ఉన్న వారికి కనిపించని దెబ్బలు అయినవి. నాడ్రైవర్ అక్కడ ఉన్న వ్యక్తులు వారించినా వినకుండా నా పై దాడి చేయగా తప్పించుకుని ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాను. కావున నాయందు దయవుంచి పై విషయాలపై విచారణ జరిపి అకారణంగానా పై దాడి చేసి అసభ్య పదజాలంతో దుర్భాషలాడి హత్య ప్రయత్నం. మమ్ములను చెయ్యటమే కాకుండా నడి రోడ్డు పై అందరూ చూస్తుండగా ఉద్దేశ్య పూర్వకంగా కుట్రతో కులం పేరుతో దూషించిన పైన తెలిపిన వారందరి పైన విచారణ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వారి నుండి నాకు ప్రాణభయం ఉన్నందున నాకు నా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ వనమా బాలవజ్రబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.