మజ్జి కృష్ణవేణి గారి మృతిపై వైయస్ జగన్ ప్రగాఢ సంతాపం

 మజ్జి శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు 

తాడేప‌ల్లి: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాతృమూర్తి మజ్జి కృష్ణవేణి గారి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణవేణి గారి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న వైయస్ జగన్, కుటుంబానికి అండగా నిలుస్తూ విలువలతో కూడిన జీవితం గడిపిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

ఈ విషాద సమయంలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మజ్జి కృష్ణవేణి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
 

Back to Top