భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు 

తాడేపల్లి : లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు చారిత్రక విజయం సాధించడంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత మహిళా జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. ఈ అద్భుతమైన విజయం  భావి తరాలకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.  భారత మహిళా క్రికెట్‌ టీమ్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నానంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
 
లార్డ్స్‌లో భారత మహిళా జట్టు అద్భుతమైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మహిళల టెస్టు ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్‌ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్‌ సేన చరిత్రకెక్కింది.

Back to Top