ఒంగోలు: పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న కనిగిరి ఆర్డీఓ కార్యాలయం, 17న ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న పొగాకు రైతుల దీక్ష కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను ఒంగోలు జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్‌చార్జి చుండూరు రవిబాబు, కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్, రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం, అధిక తిరస్కరణలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.