మాజీ ప్రధాని పీవీకి వైయ‌స్ జగన్ నివాళి

తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్ జగన్ ట్వీట్‌ చేశారు.

Back to Top