తాడేపల్లి: కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్)కు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషాన్ని ప్రసాదించడంతో పాటు ప్రజల కోసం దృఢంగా నిలబడే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు మరిన్ని విజయాలు సాధిస్తూ, రాబోయే ఏడాది అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు.