వైయస్‌ జగన్‌ ఒక కారణజన్ముడు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
 

అసెంబ్లీ: మహిళలకు భద్రత కల్పించేలా దిశ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఒక కారణ జన్ముడని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి పేర్కొన్నారు. ఆయన భగవంతుడు పంపిన దేవుని దూతగా ఆమె అభివర్ణించారు. దిశ చట్టంపై రెడ్డి శాంతి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ రోజు మహిళా భద్రతా బిల్లు కోసం దిశా చట్టం తీసుకువచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు మనస్పూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ఎన్నో శతాబ్ధాలుగా మహిళల పట్ల దౌర్జన్యాలు, అక్రమాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి ప్రజావేదికలు,  ఎన్నో మహిళా వేదికలు, సామాజిక వేదికలు, రాజకీయ వేదికలు చూస్తున్నాను. నా భర్త ఒక ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌. నేను ప్రపంచలోనూ, దేశంలోనూ మహిళలను ప్రోత్సహించే వేదికల్లో విజిటర్స్‌ మధ్య కూర్చుని చూశాను. ప్రతి చోటా అందరూ మహిళలను ప్రోత్సహించాలి. మహిళే అందరికి నాడీ. ఉమెన్‌ ఈస్‌ దీ బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ దీ బాడీ అన్నారు. మహిళలు పురుషులతో సమానమని ప్రతి వేదికల్లో చెప్పారు. మహిళలను గొప్పవాళ్లు అంటూ పొగడ్తలు చూశాం. కానీ మహిళలపై అఘాయిత్యాలు జరిగితే వెంటనే స్పందించాలి. కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలని మన దేశ పార్లమెంట్‌లో గానీ, వేరే రాష్ట్రంలోనూ ఏ సీఎం  కూడా ఇలాంటి చట్టం తీసుకురాలేదు. వైయస్‌ జగన్‌ తన సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రతి మహిళను కలిసి, వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళ స్థితిగతులు మార్చాలని, వారికి మనోధైర్యం ఇవ్వాలని, వారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలని, పురుషులతో సమానంగా రాణించాలని, వారికి ఉద్యోగ స్ఫూర్తిని ఇవ్వాలని  ఈ రోజు దిశ చట్టాన్ని మన ఏపీ  అసెంబ్లీ వేదికలో తీసుకునివచ్చి యావత్తు దేశంలోనే వైయస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారని ఒక మహిళా ఎమ్మెల్యేగా గర్వంగా చెబుతున్నాను.  గత ఆరు నెలలుగా వైయస్‌ జగన్‌ సీఎం అయినప్పటి నుంచి కూడా గమనిస్తే..ప్రభుత్వం నుంచి అభివృద్ధి, సంక్షేమ ఫలం మహిళలకు అందుబాటులో ఉండేలా,  మహిళలను మహాలక్ష్మిలా పూజించేలా చర్యలు తీసుకున్నారు. ఆశా వర్కర్లు, మధ్యాహ్న కార్మికుల వేతనాలు పెంచి ఓ తండ్రిలా, ఓ కొడుకులా, అన్నలా మనస్ఫూర్తిగా ఆదరించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని గర్వంగా చెబుతున్నాను. మా జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం, మాది కొండ ప్రాంతం.  అక్కడ గత ఆరు నెలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. 2014 నుంచి 2019 వరకు ఎన్నో బెల్ట్‌షాపులు ఉండేవి. మద్యమే కుటుంబాన్ని పోషించే వ్యక్తిని తాగుతుందా? ఆ వ్యక్తే మద్యాన్ని తాగుతున్నాడా అన్న భయంకరమైన పరిస్థితి మా జిల్లాలో ఉండేది. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక మహిళల బాధలను, భావాలను అర్థం చేసుకొని, మహిళ కష్టాన్ని, వారి కన్నీటిని తుడవాలని ఈ రోజు మద్యనిషేదం తీసుకువచ్చారు. బెల్టుషాపులు రద్దు చేశారు. ప్రభుత్వమే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి మహిళ గుండెల్లో  వైయస్‌ జగన్‌ పేరు సువర్ణ అక్షరాలతో లిఖితమవుతున్నాయని చెబుతున్నాను. అంత మంచి మనసు ఉన్న నాయకుడు వైయస్‌ జగన్‌. నేను కూడా ఉదయం లేస్తేనే నా పిల్లలను ఎక్కడికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారని  ప్రతిది వాట్సప్‌ పెట్టండి? లొకేషన్‌ పెట్టమని మదన పడుతుంటాను. ఈ విషయాన్ని జగన్‌ గుర్తించారు. ప్రతి తల్లిని ఆదుకోవాలని, ఈ సంఘర్షణను అదుపు చేయాలని, ప్రతి కుటుంబానికి బలం చేకూర్చేందుకు, మహిళ అబల అని తలంచి మంచి చట్టాన్ని తీసుకువచ్చారు. నరరూప రక్షసుల అఘాయిత్యాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని వైయస్‌ జగన్‌ సీఎం కాకుండా నింగి నుంచి నేలకు వచ్చిన భగవంతుడి దూత అని గౌరవంగా, అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి సీఎం ఈ రోజు చరిత్ర సృష్టిస్తూ..21 రోజుల్లో శిక్ష పడేలా మంచి చట్టాన్ని తీసుకువచ్చారు. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడేలా ఈ చట్టం ఉంది. ఈ చట్టం తెచ్చినందుకు వైయస్‌ జగన్‌కు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. గత ఆరు నెలల క్రితం  చూసుకుంటే..ఎన్నో కష్టాలు పడ్డాం. ఎప్పుడు పోరాటం చేయాలన్నా పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లేవారు. గళాన్ని నొక్కేవారు. దేశంలో ఎవరు తీసుకురాని చట్టాన్ని మహిళల కోసం వైయస్‌ జగన్‌ తీసుకొని వస్తే.. ప్రతిపక్ష నాయకుడు ఉల్లిపాయల కోసం గొడవ చేస్తున్నారు. ఎవరో గేటు వద్ద అడ్డుకున్నారని రాద్దాంతం చేస్తున్నారు. చంద్రబాబు మహిళలకు క్షమాపణ చెప్పాలి.  ఇలాంటి మంచి చట్టాన్ని తీసుకుని వచ్చినప్పుడు అభినందించాలి. భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. ఏపీ ప్రజలు కూడా చంద్రబాబును క్షమించరు. వైయస్‌ జగన్‌ మహిళల తాలుకా స్వేచ్ఛను కాపాడుతూ ఇలాంటి చట్టం తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నాను. రానున్న కాలంలో ఇంకా అన్ని వర్గాలు, సంఘాలను బలోపేతం చేస్తూ మంచి చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాను. భగవంతున్ని ప్రార్థించేది ఏంటంటే.. వైయస్‌ జగన్‌ ఒక కారణజన్ముడు. మహిళలకు చేయూతనిచ్చిన ఒక యుగ పురుషుడు. ఈ దిశ చట్టం తీసుకువచ్చిన   యోధుడు, వీరుడు సీఎం వైయస్‌ జగన్‌కు మనందరం  అండగా ఉండాలని కోరుతున్నాను.

Read Also: మద్యపాన నిషేధం, దిశా చట్టం బేలెన్స్ చేస్తూ మహిళా రక్షణ

Back to Top