వైయ‌స్ఆర్‌సీపీ నేత త‌లారి రంగ‌య్య పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు వెల్లువ‌

అనంత‌పురం:  రూర‌ల్  డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌(ఆర్డీటీ) ప‌రిర‌క్ష‌ణ‌కు వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు, మాజీ ఎంపీ త‌లారి రంగ‌య్య ఈ నెల 4వ‌ తేదీ నుంచి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. శుక్ర‌వారం రంగ‌య్య రాయలప్ప దొడ్డి, కన్నేపల్లి, ముద్దలాపురం గ్రామాల మీదుగా పాద‌యాత్ర కొన‌సాగింది. ఈ యాత్ర‌కు వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ సంఘీభావం తెలిపారు. అలాగే గ్రామ గ్రామంలో పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూ..ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యక్తపై ప్రజలను చైతన్యపరిచేందుకు సంస్థ సేవలను జిల్లాలో మొట్టమొదటి సారిగా ప్రారంభించిన బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి జూన్‌ 4న పాదయాత్రకు రంగ‌య్య‌ శ్రీకారం చుట్టారు. బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల మీదుగా మొత్తం 62 గ్రామాలలో 209 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా పల్లెపల్లె నుంచి ఆర్డీటీ ద్వారా లబ్ది పొందిన ప్రతి కుటుంబమూ ఓ ఉప్పెనలా తరలి వ‌చ్చి త‌లారి రంగ‌య్య‌కు సంఘీభావం తెలుపుతున్నారు.  

Back to Top