టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి

తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన 

తిరుపతి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు తిరుపతిలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. గాంధీ రోడ్డులోని నాలుగుకాళ్ల మండపం వద్ద నిర్వహించిన ఈ నిరసనలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని నినాదాలు చేశారు. టీటీడీ పరిపాలనలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. క‌ళంకితుల‌కు టీటీడీలో చోటు లేద‌ని మండిప‌డ్డారు. భ‌క్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా బీఆర్ నాయుడు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తూ, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ వంటి పవిత్ర సంస్థ ప్రతిష్టను కాపాడాలంటే తక్షణ చర్యలు అవసరమని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top