మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల డిమాండ్

పోలవరం: మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్ చేశారు. పోలవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ఇన్‌చార్జ్ తెల్లం బాలరాజు ఆదేశాల మేరకు కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వారికి తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ, మొక్కజొన్న రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నష్టపోతున్నారని అన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే చర్యలు తీసుకుని సరైన మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గ పరిశీలకులు శివరామరాజు హాజరయ్యారు. అలాగే కొయ్యలగూడెం మండలం ఎంపీపీ గంజి మాల రామారావు, రాష్ట్ర నాయకులు గంటా శ్రీను, మండల అధ్యక్షుడు తుమ్మలపల్లి గంగరాజు, టౌన్ అధ్యక్షుడు నూకల రాము, గ్రామ అధ్యక్షుడు రాంబాబు, ఎస్సీ సెల్ నాయకులు చిడిపి రవి, బీసీ సెల్ అధ్యక్షుడు మారిశెట్టి శ్రీను, కార్మిక సంఘం అధ్యక్షుడు నాగేశ్వరావు, మాజీ మండల అధ్యక్షుడు నాగేశ్వరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దూలపల్లి కాంతారావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బుజ్జిబాబు, టౌన్ వైస్ ప్రెసిడెంట్ పూలపల్లి రవి, టౌన్ యూత్ ప్రెసిడెంట్ ఏలేటి భాస్కర్, వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతంగి మున్న, కిషోర్, బన్నీ, మనోజ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
 

Back to Top