వేధింపులు తాళ‌లేక వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం 

ప‌ల్నాడు జిల్లాలో సెల్ఫీ వీడియో వైర‌ల్‌

పల్నాడు  జిల్లా:  టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నం స‌మయంలో సెల్పీ వీడియో రిలీజ్‌ చేశాడు లక్ష్మీనారాయణ. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై మండిపడ్డారు. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

‘ఈ పోలీసుల అరాచకాలకు చెక్‌ పెట్టాలి. వైయ‌స్ఆర్‌సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్‌ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు. నేను వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త అయినందునే వేధిస్తున్నారు. నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్‌ రామారావు, పత్తిపాటి రామారావు వంశీతో పాటు పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. 

నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్ల కు చెందిన టిడిపి నాయకులు ఖలీల్ రామారావు పత్తిపాటి రామారావు వంశీలు పోలీసులు వేధిస్తున్నారు. డీఎస్సీ ఆఫీసుకు పిలిచి మరిచి వేధించారు. డీఎస్పీ ఆఫీసులో నువ్వు కమ్మవాడివా.. కమ్మవాడివైతే వైయ‌స్ఆర్‌సీపీలో ఎలా ఉంటావని దూషించారు’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

Back to Top