మున్సిపల్ కార్మికుల సమ్మెకు వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియ‌న్ సంఘీభావం

విజ‌య‌వాడ :  మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు పూనూరు గౌత‌మ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.  విజ‌య‌వాడ‌లోని వెహిక‌ల్ డిపో వ‌ద్ద జ‌రుగుతున్న మున్సిప‌ల్‌ కార్మికుల దీక్షా శిబిరాన్ని గౌతమ్‌రెడ్డి సంద‌ర్శించి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తక్షణమే జీవో నెంబర్ 36 ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు ఇవ్వాల‌ని, ఆప్కాస్ పరిధిలో ఉన్న వారందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు కళ్లు తెర‌చి సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాల‌ని కోరారు.

Back to Top