నెల్లూరు: అధికార తెలుగు దేశం పార్టీకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చక ఆ పార్టీకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడారు. నెల్లూరు 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీగా టీడీపీ నుంచి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు జరిగాయి. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, అదే డివిజన్ నుంచి 200 కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారికి కండువాలు కప్పి ఆనం విజయకుమార్‌రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ మాట్లాడుతూ...`నాకు కార్పొరేటర్ పదవి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చలువే. టీడీపీ నాయకుల అరాచకాలు, ఇబ్బందులకు గురై విధిలేని పరిస్థితులలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో తిరిగి పార్టీలోకి వచ్చాను. పార్టీ బలోపేతానికి శాయశక్తుల కృషి చేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం` అన్నారు. ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ...నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ ని బలోపేతం చేసి, వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటానని మాటిచ్చారు. కార్యక్రమంలో నెల్లూరు నగర అధ్యక్షుడు, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, 17వ డివిజన్ ముఖ్య నాయకులు సి.హెచ్ ప్రభాకర్ రెడ్డి, హరిబాబు, గోపి, భాస్కర్, ఓబుల్ రెడ్డి, రూపేష్, చిన్న, ఉదయ్ భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.