29న వైయ‌స్ఆర్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం 

 తాడేపల్లి: ఈ నెల 29న వైయ‌స్ఆర్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై పీఏసీ చర్చించనుంది. 

కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని ఆయన మండిపడ్డారు. 

Back to Top