సైనికుల‌ త్యాగం ఎప్పటీకీ గుర్తుండిపోతుంది 

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ట్వీట్‌

తాడేపల్లి: విజయ్‌ దివాస్ సందర్భంగా మన సైనికుల పరాక్రమాన్ని గుర్తు చేసుకుంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘కార్గిల్ యుద్ధంలో మన సైనికులు అత్యుత్తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. 
మన సైనికుల ధైర్యం, అచంచలమైన దేశభక్తి దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్న వైయ‌స్‌ జగన్‌.. దేశ సేవలో పాల్గొంటున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 
 

Back to Top