తిరుపతి: మాజీ మంత్రి రోజా పై నగిరి టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని జీడి నెల్లూరు నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ కృపాలక్ష్మి ఖండించారు. శుక్రవారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు.`మాజీ మంత్రి రోజా పై నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మహిళలను రాజకీయంగా అనుగదొక్కాలని కుట్ర ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మహిళలు రాజకీయంగా రావాలంటే ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటుకుని నిలబడాలి, ఇందుకోసం కృషి, పట్టుదల ఉండాలి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్న మహిళా నాయకురాలు రోజాపై వ్యక్తిగత దూషణలు, విమర్శలు ప్రజాస్వామ్యం కాదు. ప్రభుత్వంలో దౌర్జన్యాలు, కిరాతకాలు, అఘాయిత్యాలతో మహిళలను సభ్య సమాజం తలదించుకునేలా అవమానించడం దౌర్భాగ్యం. గాలి భాను ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలి` అంటూ కృపాలక్ష్మీ డిమాండ్ చేశారు.