మద్యపాన నిషేధం, దిశా చట్టం బేలెన్స్ చేస్తూ మహిళా రక్షణ

విడుదల రజని
 

సీఎం జగన్ మోహన్ రెడ్డిగారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం ఆడపిల్లలక ఒక రక్షణ కవచం లాంటింది. ఇక రాష్ట్రంలో మహిళలు అబలలు కాదు సబలలు అని చెప్పుకోవచ్చు. దిశ సంఘటనలో బాధ్యుల ఎన్‌కౌంటర్ జరిగాక ఆమె ఆత్మ శాంతించింది. ఆమె మనసు ఇంకా కోరుకుంటున్నది ఏమిటంటే భవిష్యత్ లో తనలాంటి పరిస్థితి ఎవరికీ పట్టద్దు అని ఆమె ఆత్మకోరుకుంటోంది. వైయస్ జగన్ దిశ యాక్ట్ ద్వారా ఆమె ఆత్మకు శాంతినే కాదు సంతోషాన్ని అందించారు అనిపిస్తోంది. ఓ మహిళ లైంగిక దాడికి గురైతే ఆ విషయాన్ని నిరూపించే ఆధారాలు ఉంటే వెంటనే విచారణ జరిపి 21 రోజుల్లో ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని తెచ్చిన సీఎం వైయస్ జగన్ ను యావత్ దేశం హృదయపూర్వకంగా హర్షిస్తుంది. అనాదిగా మనదేశంలో మగువ తన మానం కోసం ప్రాణాన్ని పణంగా పెడుతుంది. తన గౌరవానికి ఏదైనా భంగం కలిగితే అందుకు కారకులైన వారిని శిక్షించాలని కోరుకుంటుంది. ఓ మహిళగా, సాటి మహిళ మనోభావాలను తెలుసుకోగల మనిషిగా నేను ఈ మాట చెబుతున్నాను.
పురాణాల్లో చూసినా తనను అపహరించుకు వెళ్లిన రావణుడికి సీత శిక్షపడాలని కోరుకుంది. లంకకు వచ్చిన హనుమంతుడితో నా భర్త శ్రీరాముడు రావాలి రావణ సంహారం జరగాలి అని కోరింది. సీతమ్మను అపహరించిన రావణుడికి ఏగతి పట్టిందో మనకు తెలుసు. అతడి పది తలలు తెగి కిందపడ్డాయి. కీచకుడు ద్రౌపదిని బలాత్కరించబోతే ఆమె భీముడి వద్దకు వచ్చి కీచకుణ్ణి హతమార్చమని కోరింది. తర్వాత కీచకుడికి కుక్కచావే గతి అయ్యింది. మన పురాణాల్లోనూ స్త్రీలు తమకు కష్టం కలిగితే వెంటనే తీర్పును ఆశించారు. మహిళల జోలికి వచ్చిన వారికి కఠిన శిక్షలు పడ్డాయి. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి కఠిన శిక్షలతో దిశ చట్టాన్ని తెచ్చిన మన ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. యావత్ మహిళాలోకం అంతా సాహో జగనన్నా, జయహో జగనన్నా అంటూ నినాదాన్ని ఇస్తోంది.  

సోషల్ మీడియాలో అసభ్యమైన కామెంట్లతో ప్రజా ప్రతినిధులమైన మేమే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇక సాధారణ స్త్రీల పరిస్థితి ఏమిటో ఆలోచిస్తేనే బాధగా ఉంది. ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్నాం ఇన్నాళ్లూ. ఇకపై సోషల్ మీడియాలో ఎవరైనా మహిళలపై తప్పుడు రాతలు రాస్తూ అసభ్యమైన పోస్టింగులు చేస్తే జైలు శిక్ష తప్పదని ఈ దిశ చట్టం ద్వారా ప్రభుత్వం చెబుతోంది.
సీఎం దిశ యాక్ట్ తేవడం గొప్ప సాహసం అని చెప్పాలి. తన సుదీర్ఘ పాదయాత్రలో 3648 కి.మీ పాదయాత్రలో సామాన్యుడి బాధ విన్నారు. పింఛన్ రావట్లేదని, రేషన్ కార్డు లేదని చెబుతున్న మాటలు విన్నారు. సామాన్యుడికి చిన్నచిన్న విషయాల్లోనూ ఎన్నో బాధలు ఉన్నాయని అర్థం చేసుకున్నారు. 5 కోట్ల ప్రజల ఆవేదనకు, అభిప్రాయానికి సమాధానంగా వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చింది. నిజంగా ఈ స్థాయి నుంచీ మార్పును తేవాలని, అందరికీ న్యాయం చేయాలని సంకల్పించుకున్నారు వైయస్ జగన్. బ్రహ్మాండమైన 9 పథకాలు నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబాన్నీ ఆదుకుని అండగా ఉంటున్నారు. మహిళలపై 80% హెరాస్మెంట్స్ అన్నీ మద్యం తాగినవారు చేస్తున్నవే. నవరత్నాల్లో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. నవరత్నాలు పథకమైన మద్యపాన నిషేధం ద్వారా మద్యపానాన్ని కంట్రోల్ చేస్తూ, మరో పక్క దిశ యాక్ట్ ద్వారా నేరస్తులకు వేగంగా శిక్ష పడేలా బేలెన్స్ చేస్తున్నారు. ఇది మనందరికీ గర్వకారణం.  

Read Also: దిశ చట్టం మహిళలందరికీ శ్రీరామరక్ష

   

తాజా వీడియోలు

Back to Top