ఎల్లో మీడియా ఫేక్‌ ప్రచారం

అనంత‌పురం:  తాను పార్టీ మారుతున్న‌ట్లు ఎల్లో మీడియా ఫేక్ ప్ర‌చారం చేస్తుంద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాకు రాజకీయ భిక్ష పెట్టింది దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని, వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేద‌న్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవమ‌ని కొట్టిపారేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయ‌స్ జగన్ వెంటే ఉంటానని ఉద్ఘాటించారు. అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ నేతలు వేధించారని గుర్తు చేశారు. వైయ‌స్ఆర్‌ కుటుంబాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు ప‌న్నుతున్నార‌ని విమ‌ర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని గురునాథ‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. 

Back to Top