ప్రజల్లో టీడీపీ నమ్మకం కొల్పోయింది...

వచ్చే ఎన్నికల్లో గెలవాలని  కుటిల యత్నాలు

ఓట్ల తొలగింపు అప్రజాస్వామికం

వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి

అనంతపురం:వైయస్‌ఆర్‌సీపీ నేతలు, సానుభూతి పరుల తొలగింపును వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి ఖండించారు.టీడీపీపై ప్రజలకు నమ్మకం లేదని,ఏదోరకంగా గెలవాలనే ఉద్దేశ్యంతో కుటిల యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఒక ప్రైవేట్‌ టీం ద్వారా ఓట్ల తొలగింపు చేస్తున్నారన్నారు.అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోనే సుమారు 64,800 ఓట్లు తొలగించారన్నారు.చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరుపర్చకుండా స్టేషన్ల చుట్టూ తిప్పారో..అలాగే గతంలో అనంతపురం జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి,పెద్దారెడ్డి వంటి నేతలపై తప్పుడు  కేసులు బనాయించి జైల్లో పెట్టించారని గుర్తుచేశారు.ఓట్ల తొలగింపును ప్రశ్నిస్తే అన్యాయంగా వైయస్‌ఆర్‌సీపీ నేతలను,కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యవాదులంతా టీడీపీ అప్రజాస్వామిక విధానాలను ఖండిచాలన్నారు.ప్రజా స్వామ్యానికి ముప్పువాటిల్లే విధంగా చంద్రబాబు ఆదేశాల మేరకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Back to Top