బొల్లా బ్రహ్మనాయుడికు బెయిల్‌ మంజూరు 

 హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కోర్టు విధించిన 3 రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ  అధికారులు ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని, అలాగే రూ. 20 వేల చొప్పున రెండు పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Back to Top