తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా ప్రభుత్వ పరిధిలో పారదర్శకంగా నడిచిన మద్యం పాలసీలో అవినీతికి ఆస్కారమే లేదని, కేవలం కారుమూరి కుటుంబాన్ని, బీసీ నేతలను వేధించడానికే కూటమి ప్రభుత్వం 'మద్యం రవాణా స్కామ్' అనే ఫేక్ కేసును తెరపైకి తెచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌ర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కాగ్ తో సహా ప్రభుత్వ సంస్థలు అభ్యంతరం చెప్పకపోయినా.. నారా లోకేష్ అనుంగ శిష్యుడైన టీఎన్‌ఎస్‌ఎఫ్ (TNSF) నేత చేత అక్టోబర్ 10, 2025న టీడీపీ ఆఫీసులో స్క్రిప్ట్ రాయించి అక్రమ కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్. జగన్ హయాంలో రవాణా టెండర్లు పారదర్శకంగా జరిగాయని, ఉన్నత విద్యావంతుడైన కారుమూరి సునీల్ కుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి లోకేష్ వికృత రాజకీయం చేస్తున్నారన్నారు. కూటమి పెట్టే అక్రమ కేసులకు వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా సైనికులే భయపడలేదని, లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో ఈ కక్షసాధింపులకు పదింతలు 'రిటర్న్ గిఫ్ట్' ఇవ్వడం ఖాయమని నాగార్జున యాదవ్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ ప్రొడక్షన్' నుంచి ఇప్పుడు 'మద్యం రవాణా స్కామ్' అనే కొత్త సినిమాను మార్కెట్లోకి తెచ్చారు. క్కడా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ లెక్కలతో నడిచిన వైయస్ఆర్‌సీపీ హయాం నాటి మద్యం పాలసీలో అవినీతికి ఆస్కారం ఎక్కడుందో మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి.కేవలం వైయస్ జగన్ వెంట నడుస్తున్న బడుగు, బలహీన వర్గాల (బీసీ) నాయకులను లక్ష్యంగా చేసుకుని, ఏలూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏ ప్రభుత్వ సంస్థా చెప్పలేదు.. టీడీపీ ఆఫీసులోనే స్కామ్ స్క్రిప్ట్ తయారీ! మద్యం రవాణాలో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత విచారణ జరిపిందా? అంటే లేదు. కనీసం ఆడిట్ లో గానీ, లేదా దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన కాగ్ (CAG) నివేదికల్లో గానీ ఎక్కడైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయా? అంటే అదీ లేదు. ఏ ప్రభుత్వ సంస్థా అవకతవకలు జరిగాయని చెప్పలేదు. కూటమి ప్రభుత్వం జూన్ 4, 2024న అధికారంలోకి వచ్చి, నారా లోకేష్ డూప్లికేట్ సీఎం అయిన 494 రోజుల తర్వాత అక్టోబర్ 10, 2025న ఈ అక్రమ ఫిర్యాదును సృష్టించారు. ఫిర్యాదు చేసిన సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి మరెవరో కాదు.. నారా లోకేష్ అనుంగ శిష్యుడు, టీడీపీ అనుబంధ విభాగం 'తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్' (TNSF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. డైరెక్షన్ లోకేష్ దే: టీడీపీ కార్యాలయంలో కూర్చునే వ్యక్తి అడ్డగోలుగా రూ. 200 కోట్ల స్కామ్ అని ఫిర్యాదు ఇవ్వడమే ఆలస్యం.. గంటల వ్యవధిలోనే డీజీపీ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విడ్డూరంగా ఫిర్యాదుదారుడు రూ. 200 కోట్లు అంటే, డీజీపీ గారు మాత్రం రూ. 195 కోట్లు అని ఎఫ్ఐఆర్‌లో రాశారు. ఈ కేసులో కంప్లైంట్, ఇన్వెస్టిగేషన్ అంతా లోకేష్ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లేగా టీడీపీ ఆఫీసులో రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోంది. రవాణా టెండర్లపై పచ్చ మీడియా అబద్ధాలు.. జగన్ హయాంలో రవాణా ఛార్జీలు రూ. 32 ఉన్నాయంటూ ఎల్లో మీడియా రాస్తున్న వార్తలు అవాస్తవం. ను నాగార్జున యాదవ్ తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి వైయస్ జగన్ హయాంలో రవాణా ఛార్జీలు కేవలం రూ. 19 మాత్రమే ఉన్నాయి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాకే డిపోల పంపిణీ నుంచి అమ్మకాల వరకు అంతా పారదర్శకంగా మార్చారు. ఒక్కో జిల్లాలో దూరం, ఆర్డర్లు, రిటైల్ షాపుల పరిస్థితులను బట్టి వేర్వేరు రేట్లు ఉంటాయి. వీటిని జిల్లా స్థాయి కమిటీలే స్వయంగా నిర్ణయిస్తాయి. కోవిడ్ సంక్షోభం - హమాలీల ధర్నా.. కోవిడ్ మహమ్మారి వల్ల 2020 ఏప్రిల్ - జూలై మధ్య లిక్కర్ సేల్స్ 68 శాతం, బీర్ సేల్స్ 93 శాతం పడిపోయాయి. దీంతో హమాలీ అసోసియేషన్ వారు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన కమిషన్ ఉండాలని సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికే సెప్టెంబర్ 4, 2025న స్టేట్ వైడ్ (రాష్ట్రవ్యాప్త) టెండర్లకు కాల్ ఫర్ చేస్తూ పారదర్శక నిర్ణయం తీసుకున్నాం. ఆ జీవో కాపీ ఇప్పటికీ ఉంది. ఈ టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు.. నారా లోకేష్ అయినా కోట్ చేయవచ్చు. మొత్తం 6 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, రెండు దఫాల ఫైనాన్షియల్ బిడ్ కమిటీ పరిశీలన తర్వాత అత్యంత తక్కువ ధర (L1) కోట్ చేసిన వారికే టెండర్లు దక్కాయి. ఇందులో అవినీతి ఎక్కడుందో లోకేష్ చెప్పాలి. చంద్రబాబు తెచ్చే ప్రైవేట్ మద్యం పాలసీలోనే ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు దోచుకునే ఆస్కారం ఉంటుంది. లోకేష్ బెదిరింపులకు భయపడం! బీసీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్న తీరుపై ఆక్షేపణీయం. "నారా లోకేష్ గుర్తుపెట్టుకో.. కారుమూరి సునీల్ కుమార్ ఉన్నత విద్యావంతుడు. మీకంటే ప్రపంచంలోనే బ్రహ్మాండమైన, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి. వైయస్ జగన్ గారి జెండా, అజెండాను నమ్మి ప్రజాసేవ చేస్తున్న నేత. అలాంటి వ్యక్తిపై ముక్కూమొహం తెలియని మీ అనుంగ శిష్యులతో ఫేక్ ఫిర్యాదులు చేయించి, అక్రమంగా జైల్లో పెట్టిస్తూ వికృతమైన రాజకీయ రసక్రీడకు పాల్పడుతున్నావు. దమ్ముంటే కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని నేనే అరెస్ట్ చేయించానని నేరుగా బయటకు వచ్చి చెప్పు." యాక్టివిస్టులే భయపడలేదు: ఈ రెండేళ్ల కూటమి పాలనలో వేలాది మంది వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారు. మీ అరెస్టులకు, రిమాండులకు మా సోషల్ మీడియా సైనికులే భయపడలేదు. మీరు 14 రోజులు రిమాండ్‌కు పంపితే.. 15వ రోజే జైలు నుంచి బయటకు వచ్చి 'జై జగన్' అంటూ మళ్లీ పోస్టులు పెడుతున్నారు. అలాంటిది బడుగు, బలహీన వర్గాల నేతలపై ఆర్థిక ఆరోపణలు చేస్తే భయపడి పారిపోతామనుకుంటున్నారా? పదింతలు 'రిటర్న్ గిఫ్ట్' తప్పదు.. "ఈ కుట్రపూరితమైన అక్రమ కేసులు, మీ అధికార బలం ఎల్లకాలం శాంతియుతంగా సాగవు. ప్రజాస్వామ్యంలో ఏదీ శాశ్వతం కాదు, ప్రజలు అన్ని వాస్తవాలను గమనిస్తున్నారు. నారా లోకేష్.. నువ్వు మాపై పెడుతున్న అక్రమ కేసులకు, వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం నీ పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తుకు తెచ్చుకుని ఆలోచించుకో. ఇవాళ నువ్వు చేస్తున్న ఈ పైశాచిక చర్యలకు భవిష్యత్తులో ఇంతకు పదింతలు 'రిటర్న్ గిఫ్ట్' ఇవ్వడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు" అని యనమల నాగార్జున యాదవ్ హెచ్చరించారు.