తాడేపల్లి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఆమెకు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ భారత దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్న మీరు మరింత కాలం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తూ దేశ ప్రగతికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు. https://x.com/ysjagan/status/2068174889186713602?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2068174889186713602%7Ctwgr%5Ec28b6c30f0f4e5752a70f0a036faca9ac9876ccf%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fandhra-pradesh%2Fys-jagan-extends-birthday-whishes-droupadi-murmu-2820143