న్యూఢిల్లీ: 'ఆపరేషన్ సిందూర్ వేగవంతమైన ప్రతీకార చర్య మాత్రమే కాదు.. భారత సైనిక శక్తి ఎంత బలమైనదో ప్రపంచానికి చూపించిన సందేశం. ఇది పాత భారత్ కాదు.. ప్రతీకారం తీర్చుకునే నూతన భారత్, శత్రువులను నిలువునా తుడిచేస్తుంది' అని రాజ్యసభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. 'ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు కలిసి నడవలేవు. నీరు, రక్తం కలిసి పారలేవు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం తాత్కా లిక పరిష్కారమే. ఉగ్రవాద భావజాలాన్ని సమూలంగా నిర్మూ లించాలి. ఉగ్రవాద శిబిరాలు తిరిగి ఏర్పడకుండా.. కొత్త ఉగ్రవా దులు పుట్టకుండా... మూలాలపై వేట జరగాలి. అప్పుడే శాంతి సాధ్యమవుతుంది. ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం చూపిన ధైర్యం, తక్షణ స్పందన గొప్పవి. వారి వల్లే మనం భద్రంగా జీవించగలుగుతున్నాం. మన సైన్యం పాకిస్తాన్లోని కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ దాడులు భారత ఎయిర్ డిఫెన్సు దాటలేకపోయాయి. ఈ దాడుల సందర్భంగా కొందరు సైనికులు వీరమరణం పొందారు. అందులో ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ కూడా ఉన్నారు. వారందరికీ నివాళులర్పిస్తున్నా. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్రేషియా అందించి.. కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని వైయస్ఆర్‌సీపీ తరపున కోరు తున్నా. అలాగే పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పౌరుల్లో ఏపీకి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి జె.ఎస్.చంద్రమౌళి, ఐటీ ప్రొఫెషనల్ మధుసూదన్ ఉన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా' అని వైవీ సుబ్దారెడ్డి అన్నారు. పహల్గాం దాడిని ఖండిస్తూ వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ 'ఎక్స్'లో చేసిన పోస్టును వైవీ సుబ్బారెడ్డి సభలో చదివి వినిపించారు. మృతుల కుటుంబాలకు ప్రకటిం చిన ఆర్థిక సాయాన్ని వెంటనే అందజేయాలని కోరారు. దేశ రక్షణ అంశంలో రాజకీయం వద్దు.. ఈ సమయంలో రాజకీయ లబ్దిని ఆశించడం సరికాదని, అన్ని పార్టీలూ ఒకే స్వరంతో ఉగ్రవాదాన్ని ఖండించాలని వైవీ సుబ్బా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది నూతన భారత్ అని... ఉగ్రవాదంపై ఏ స్థాయికైనా వెళ్లగల శక్తి భారత్కు ఉందన్నారు. పాకిస్తాన్కు నీటిని నిలిపివేసిన ప్రభుత్వం.. సవల్కోట్, కిర్టాయ్, పాకల్దుల్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదో వెల్లడిం చాలని కోరారు. వైయస్ఆర్‌సీపీని ఎందుకు మినహాయించారు? ఉగ్ర దాడులపై ప్రపంచ దేశాలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్రం పంపిన ఏడు ప్రతినిధి బృందాల్లో వైయస్ఆర్‌సీపీకి చోటు కల్పించకపోవడాన్ని ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి తప్పుబట్టారు. రాజ్యసభలో వైయస్ఆర్‌సీపీ ఏడో పెద్ద పార్టీ అని, కానీ ప్రతినిధి బృందాల్లో మాత్రం స్థానం కల్పించలే దన్నారు. ఇలాంటి పర్యటనలు భారత ప్రయోజనాల పరిరక్ష ణకు, దేశ వాదనను అంతర్జాతీయ వేదికలపై వినిపించడానికి ఎంతగానో అవసరమన్నారు. అందుకే తమను పక్కన పెట్టినప్ప టికీ స్వాగతిస్తున్నామని చెప్పారు. భారత సాయుధ దళాలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. మన శక్తిని చూసి.. శత్రు దేశాలు మళ్లీ భారత్పై దాడి చేయాలన్న ఆలోచన కూడా చేయ కూడదన్నారు. 2025ను రక్షణ శాఖ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ నిర్ణయాన్ని సుబ్బారెడ్డి ప్రశంసించారు.