ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం
 

 

అమరావతిః 2014–19 వరుకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు.కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 1,513 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని..కాని 391 మందికి మాత్రమే  పరిహారం ఇచ్చినట్లుగా రికార్డులు చెబుతున్నాయన్నారు. గత ప్రభుత్వం రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని అర్థమవుతోందన్నారు.మీ జిల్లాల్లో డేటాను పరిశీలించాలని కలెక్టర్లను కోరారు.

Back to Top