పోలింగ్ సందర్భంగా హింసకు పాల్పడేందుకు టీడీపీ కుట్ర

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి

తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన నియోజకవర్గాల్లో పోలింగ్ సందర్భంగా హింసకు పాల్పడేందుకు టీడీపీ కుట్ర‌లు ప‌న్నుతుంద‌ని , పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ భద్రత విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాల‌ని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కోరారు.  

రాష్ట్రవ్యాప్తంగా రేపు జరగనున్న పోలింగ్లో హింసకు పాల్పడేందుకు టీపీపీ కుట్ర పన్నింది. ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్ల ద్వారా హింసకు టీడీపీ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి చంద్రబాబు ఇప్పటికే ఆపార్టీ నాయకులకు డైరెక్షన్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. తమ అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు పాల్పడి, ఆ ఘటనలకు అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించి, ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీ పై నెట్టివేయాలని వ్యూహం పన్నారు. తద్వారా తప్పుడు ప్రచారంచేసి, ఓటర్లను ప్రభావితంచేయడానికి, పోలింగ్ స్టేషన్లలో ఓటువేసేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిర్ణయానికి వచ్చి, ఫ్రస్టేషన్లో టీడీపీ ఇలాంటి కుట్రలు పన్నుతోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తిచేస్తున్నాను. ఎలాంటి కవ్వింపు చర్యలు చోటుచేసుకున్నా, హింసను ప్రేరేపించేందుకు టీడీపీ యత్నించినా వైయస్ఆర్‌సీపీ  అభ్యర్థులు, ఏజెంట్లు, శ్రేణులు పూర్తి సంయమనంతో వ్యవహరించాలి. పోలింగ్ అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని కోరుకుంటున్నాను. 

 

Back to Top