ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం 

మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ ఏర్పాట‌య్యాక ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం అయ్యింద‌ని మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఇన్‌చార్జ్ మ‌ల్లాది విష్ణు విమ‌ర్శించారు. విజ‌య‌వాడ న‌గ‌రంలోని మధురం నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డివిజన్ కో-ఆర్డినేటర్ ఎస్కే బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గన్ హయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేది అన్నారు. కూటమి ప్రభుత్వంలో వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వారిని పట్టించుకునే పరిస్థితి లేదని మండిప‌డ్డారు. విజయవాడ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వైద్యం అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పేద ప్ర‌జ‌ల‌కు స‌రైన వైద్యం అంద‌క  తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెర‌చి పేద‌ల‌కు వైద్యం అందించాల‌ని కోరారు.

Back to Top