స్వ‌రాజ్‌మైదానంలో జ‌వాన్ ముర‌ళి నాయ‌క్‌కు ఘ‌న నివాళులు

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు కొవ్వొత్తుల‌తో శ్ర‌ద్ధాంజ‌లి

విజ‌య‌వాడ‌: ఎన్టీఆర్ జిల్లా  వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో  స్వరాజ్ మైదానం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జ‌మ్ముక‌శ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు దేవినేని అవినాష్ , మాజీ  ఎమ్మెల్యే లు వేలంపల్లి శ్రీనివాస్ , మల్లాది విష్ణు , మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు , వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు  మురళి నాయక్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కోవొత్తులతో  శ్రద్ధాంజలి ఘటించారు.  ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు మాట్లాడారు. వారు ఏమ‌న్నారంటే..


ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్
  

  • దేశం కోసం ప్రాణం విడిచిన మురళి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది 
  •  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 13వ తేదీ మురళీ కుటుంబాన్ని పరామర్శిస్తారు  
  • భారత ఆర్మీ, నేవీ,డిఫెన్స్ కు దేశపౌరులుగా మేం అండగా ఉంటాం
  • కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది
  • అనుమతులు లేకుండా వైసీపీ నేతల ఇంట్లో సోదాలు చేయటం దారుణం
  • మాజీమంత్రి విడదల రజిని మీద దాడి దుర్మార్గం
  • చంద్రబాబు ఇప్పటి వరకు చేసిందేమీ లేదు
  • మాజీ ఎమ్మెల్యే, వెలంపల్లి శ్రీనివాస్ 
  • భారత సైన్యంలో ముఖ్య పాత్ర పోషించి ప్రాణాలు అర్పించిన వ్యక్తి మురళి నాయక్
  • పాకిస్థాన్ ని సమర్ధవంతంగా మన ఆర్మీ ఎదుర్కొంది
  • వాళ్ళ ప్రాణత్యాగం వలనే మనం ఈ విధంగా ఉన్నాం
  • ప్రభుత్వం ఇప్పటి వరకూ మురళి కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేయలేదు
  • ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది
  • విడదల రజిని మీద దౌర్జన్యం చేయడం దారుణం
  • ఆంధ్రాలో పాలన ఎటు పోతుంది
  • రాష్ట్రంలో ఈ విధమైన పాలన దురదృష్టకరం
  • మాజీ ఎమ్మెల్యే , మల్లాది విష్ణు 
  • మురళి నాయక్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం 
  • యుద్ధంలో అనేక మంది జవాన్లు కష్టపడ్డారు,కొంతమంది ప్రాణాలు కోల్పోయారు
  • ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది
  • వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ... మురళి నాయక్ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు 
  • ఈ వార్త తెలుసుకున్న కొంతమంది నేతలు ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు
  • ఇలాంటి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది  
  • మాజీమంత్రి రజిని పై దాడి హేయమన చర్య 
  • హై కోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావటం లేదు 
  • రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది...దీనికి పుల్ స్టాప్ పెట్టాలి
Back to Top