జడ్పీటీసీ రాధాస్వామికి తలారి రంగయ్య ప‌రామ‌ర్శ‌

చికిత్స అవసరాల నిమిత్తం రూ. 40 వేలు  ఆర్థిక సహాయం  

అనంత‌పురం: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరు నగరంలోని మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కుందుర్పి జడ్పీటీసీ రాధాస్వామిని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యులు, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను రాధాస్వామిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో తలారి రంగయ్య మాట్లాడి రాధాస్వామి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మెడికల్ బిల్లులో మినహాయింపు ఇవ్వాలని తలారి రంగయ్య కోరగా.. మణిపాల్ హాస్పిటల్ ఎండీ సానుకూలంగా స్పందించారు. అనంతరం రాధాస్వామి కుటుంబ సభ్యులతో తలారి రంగయ్య మాట్లాడి.. వైద్య అవసరాల నిమిత్తం 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాధాస్వామికి వ్యక్తిగతంగా, పార్టీపరంగా అన్నివిధాలా అండగా ఉంటామని తలారి రంగయ్య భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ల విభాగం అధ్యక్షులు బొమ్మయ్య, లీగల్ సెల్ ఉపాధ్యక్షులు హనుమంతరెడ్డి, క‌ళ్యాణ‌దుర్గం మండల కన్వీనర్ గోళ్ళ సూరి, మున్సిపల్ విభాగం అధ్యక్షులు దొడగట్ట మురళి, మల్లి, భీమప్ప పాల్గొన్నారు

Back to Top