సిడ్నీ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీలో వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ అమర్నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నేతలు భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ఆర్ జయంతి వేడుకలకు వర్చువల్‌గా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తే.. తండ్రిని మించి పాలనను వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించారని గుర్తు చేశారు. వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని, అయితే వైయస్ జగన్ తండ్రిని మించిన పాలన అందించారని తెలిపారు. వ్యవసాయం, విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదని గోవిందరెడ్డి చెప్పారు. వైయస్ఆర్‌సీపీకి మద్దతుగా నిలిచిన కుటుంబాలకు ఆయన కృతజ్ఞతలు. ప్రజాసేవకులుగా ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా.. పార్టీ అండగా నిలుస్తుందని, ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటామన్నారు. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు అని అన్నారు.