మాట తప్పిన నాయకులను నిలదీద్దాం..! 

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు పిలుపు

తాడేప‌ల్లిగూడెంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మం

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పిన కూటమి నాయకులను నిలదీద్దామని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు   పిలుపునిచ్చారు.  తాడేపల్లిగూడెం నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బాబు షూరిటి  మోసం గారంటీ కార్యక్రమం  కొట్టు సత్యనారాయణ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు.  ఇందులో భాగంగా బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ క్యూ ఆర్‌ కోడ్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. కార్యక్రమాల్లో పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు, ముప్పిడి సంపత్ కుమార్, ధర్మరాజు, జడ్డు హరిబాబు,పెంటపాడు అధ్యక్షులు కైగాల శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top