చిత్తూరు: ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, ఆ తరువాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేయడం వైయస్ జగన్ గుణమని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో గురువారం `బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ` కార్యక్రమం పెద్దిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి హాజరై `రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో` కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, నాయకులు భాస్కర్ రెడ్డి, పుంగనూరు ఎంపీపీ , అలీమ్, పుంగనూరు మున్సిపల్ చైర్మన్, రొంపిచర్ల ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, తదితరులు చంద్రబాబు రీ కాలింగ్ మానిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నేతలు ప్రసంగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ : చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో మోసం చేశాడు చెప్పిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తుంటే ప్రతిపక్ష నాయకులను జైల్లో వేస్తున్నాడు ఇచ్చిన హామీలు అమలు చేశానని చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాడు మద్యపాన నిషేధం ఎత్తేశాడు 2014 లో రైతులు రుణమాఫీ పేరుతో మోసం చేశాడు ఆ రోజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నీలా అబద్ధపు హామీ ఇవ్వలేదు ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నా.. ఇచ్చిన హామీలు అమలుచేసిన నాయకుడు వైయస్ జగన్ అన్నివర్గాల ప్రజలు మోసం చేయడం చంద్రబాబు నైజం, ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేయడం మన నాయకుడు నైజం రాష్ట్రంలో ప్రతి రైతు ఇబ్బందులు పడుతున్నాడు, మిర్చి, మామిడి, పొగాకు రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నాడు ఆసియా ఖండంలో చిత్తూరు జిల్లాలోనే మామిడి పంట ఎక్కువగా పండిస్తున్నారు నా చిన్నతనంలో కూడా మామిడికి కిలో రెండు రూపాయలు ధర లేదు. ఇంత తక్కువ రేటు ఎప్పుడు లేదు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పేవన్నీ అబద్దలే..సిగ్గులేదా అని అడుగుతున్నా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం, నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. ఆ తర్వాత మండల స్థాయిలో మండల అధ్యక్షులు ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం గ్రామ గ్రామాన ఈ కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకు వెళ్ళాలి భూమన కరుణాకరరెడ్డి కామెంట్స్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే ఒక ధైర్యం, ఒక స్థైర్యం విద్యార్థి దశ నుంచి యూనివర్సిటీ రాజకీయాల నుంచి రామచంద్రారెడ్డితో పరిచయం ఉంది రామచంద్రారెడ్డికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా.. మొదటిగా కాలేజీ రోజులు 1975 లో మీసాల రామచంద్రారెడ్డి, 1980 లో బుల్లెట్ రామ చంద్రా రెడ్డి, జనతా రామ చంద్రారెడ్డి, పీలేరు రామచంద్ర రెడ్డి, పుంగనూరు రామచంద్ర రెడ్డి, ఇప్పుడు పెద్దాయన అని అభిమానం గా పిలుస్తున్నారు స్వయం కృషి తో ఎదిగిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి అంటే పట్టుదల , ధైర్యానికి గల వ్యక్తి చంద్రబాబు ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు, 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేయడం లేదు 85 లక్షలు మందికి తల్లికి వందనం ఇవ్వాలి..50 లక్షలు మందికి ఇచ్చారు, 33 లక్షలు మందికి ఎగనామం పెట్టారు ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం అంటున్నారు రెండు లక్షలు యాభై వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారు చంద్రబాబు బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటనకు వేలాది మంది పోలీసులతో వలయం సృష్టించారు కొండలు, తుప్పలు దాటుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కు వచ్చారు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని తెలుసుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డి సభ కు ప్రజలు భారీ గా తరలి వచ్చారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దండు పాల్యం బ్యాచ్ అంటున్నారు ..టిడిపి వాళ్ళు వేద పండితులా..? ఎల్లో మీడియా టివి5, ఏబీఎన్ లు భృగు మహర్షి, కశ్యప మహర్షి లా..? వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో చిత్తూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా, బలం ఏంటో తెలిపింది, రామచంద్ర రెడ్డి బలం ఏమిటి అని తెలిసింది ఏడాదిగా ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసింది, చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెట్టిన సంతకం హామీలు, మోసాలు అన్ని ప్రజలు తెలియాలి ప్రతి మండలం లో సమావేశం నిర్వహించాలి