క‌రేడు గ్రామ‌స్తుల పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు

ప్ర‌కాశం జిల్లా: కరేడులోని బన్నేరుగుంట ఉపాధిహామీ కూలీలను కలిసి భూసేకరణకు వ్యతిరేక పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ బుర్రా మధుసూదన్ యాదవ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మ‌ద్ద‌తు తెలిపారు. ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ.. భూములు తీసుకోవడం వలన ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.  మా పొలం ..మా ఊరి చెరువు ఇవ్వమంటూ కూలీలు కరాకండిగా తేల్చిచెప్పారు.

Back to Top