దిగజారుడు రాజ‌కీయాలు మానుకోండి

మాజీ మంత్రి సాకే శైల‌జ‌నాథ్‌

నార్పల మండలంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం విజ‌య‌వంతం

అనంత‌పురం జిల్లా:  కూట‌మి ప్ర‌భుత్వం దిగ‌జారుడు రాజ‌కీయాలు మానుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి సాకే శైల‌జ‌నాథ్ హిత‌వు ప‌లికారు. నార్ప‌ల మండ‌లంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం పోలీసుల కాంక్షలు నడుమ విజయవంతం అయ్యింది. ముందుగా వాల్మీకి టెంపుల్ లో గల కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి ఏర్పాట్లు చేశారు. కానీ కొందరు కూటమి నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని అక్కడి నుండి వేరే ప్రదేశానికి మార్చేశారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ.. పోలీసులు పెట్టే ఆంక్షలు అందరికీ ఒకేలాగా ఉంటే బాగుంటుందని అధికారంలో ఉన్న వారికి ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్న వారికి ఒకలాగా ఉండడం సరికాదని అన్నారు. ఈ కమ్యూనిటీ హాల్ నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నేను ఇచ్చిన‌ నిధులతో నిర్మించినవే అంతేకాదు అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో రాజకీయ సమావేశాలు అన్నీ ఈ కమ్యూనిటీ హాల్ లోనే జరిగేవి. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. 

పరిపాలన చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, మీరు చేసిన మోసాలను ప్రజల సమక్షంలో లేవనెత్తుతున్నామని నాలుగు గోడల మధ్య జరపవలసిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం మీ  పాలనకు నిదర్శనం. మీరు పెట్టే ఆంక్షలు ఇక్కడ ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడడు మీరు ఇలాంటివి ఇంత భయపెడితే అంతలా ఎదుర్కోడానికి ప్రతి వైసిపి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. 

ఇలాంటి పిరికిపంద చర్యలు మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఎప్పుడైతే ఇలాంటి చర్యలకు మీరు పాల్పడ్డారు అప్పుడే మీలో ఏదో తెలియని అభద్రతాభావం మొదలైంది అని అర్థమవుతుది. 

మాకేం భయం లేదు మీరు పర్మిషన్ ఇయ్యనంత మాత్రాన మీరు ఏదో సాధించాము అని భ్ర‌మ పడితే అది పొరపాటు. ఇలాంటి సంఘటనలను మీరు ఎన్ని సృష్టించిన ప్రజల పక్షాన పోరాడటానికి కార్యకర్తలకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ ఉంటుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఖాదర్ వలీ,  సత్యనారాయణ రెడ్డి, రఘునాథ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ నాగేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Back to Top