కేసుల‌కు భయపడేది లేదు..ప్రజల తరఫున పోరాటం ఆగ‌దు

మూడేళ్ల‌లో మా ప్ర‌భుత్వం వ‌స్తోంది..వడ్డీతో స‌హా చెల్లిస్తాం

చంద్రబాబు కూట‌మి ప్ర‌భుత్వానికి వైయ‌స్ జ‌గ‌న్ సీరియ‌స్ వార్నింగ్ 

చంద్రబాబు దుష్టపాలనను ఎవరూ ప్రశ్నించకూడదట

రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని మామీద విమర్శ గుప్పించారు

కోవిడ్‌ లాంటి పరిస్థితులను ఎదుర్కొని.. ఐదేళ్లలో మేం చేసింది 3 లక్షల కోట్లు అప్పే

చంద్రబాబు ప్రభుత్వం.. ఈ ఏడాదిలోనే లక్షా  75 వేల కోట్లకు పైనే  అప్పులు 

ఎవరి ఏ స్కీమ్‌ ఇచ్చింది లేదు.. మరి ఆ డబ్బంతా ఏమైంది?

కరెంట్‌ చార్జీలు తగ్గించడం కాదు.. పెంచారు

చంద్రబాబు పుణ్యాన అమూల్‌ మూత పడుతోంది

హెరిటేజ్‌ పాల రేట్లు మాత్రం పెరిగాయ్‌

మేం తెచ్చిన మెడికల్‌ కాలేజీలపై ఎవరూ ప్రశ్నించకూడదు

హత్యలు, అత్యాచారాలపై కూడా మాట్లాడకూడదట

ప్రశ్నిస్తే ప్రజల తోకలు కట్‌ చేస్తామంటున్నారు

ఇవేవీ అడగకూడదు.. అడిగితే తప్పుడు  కేసులు

ప్రతీ మహిళకు రూ.18 వేలు ఇస్తామన్నారు.. ఏమైంది?

బస్సు ఉచిత హామీ ఇంకా అమలు కాలేదు

రైతు భరోసా ఏమైందో చంద్రబాబు చెప్పాలి

ఇస్తామన్న గ్యాస్‌ సిలిండర్లు ఏమయ్యాయి?

నిరుద్యోగ యువతకు రూ.36 వేలు అన్నారు.. ఏమైంది?

50 ఏళ్లు దాటితే ఫించన్‌ అన్నారు.. ఏమైంది?

కొత్త పీఆర్‌సీ ఏమైందో చెప్పాలి

వీటి గురించి ఎవరూ ప్రశ్నించకూడదు?

చంద్రబాబు  తప్పుడు విత్తనం వేస్తున్నారు, అది చెట్టవుతుంది

అప్పుడు వ్యవస్థ ఎవరి చేతుల్లోనూ ఉండదు

 దెబ్బ తిన్నవాడు రేపు మేం అధికారంలోకి వచ్చాక నా మాట కూడా వినే పరిస్థితి ఉండకపోవచ్చు

చంద్రబాబూ ఇప్పటికైనా మేలుకో.. తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సదిదిద్దుకో

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి

హైకోర్టు ఆదేశాలున్నా.. పోలీసులు అడ్డుతగులుతున్న పరిస్థితి 

సీఐ గన్‌ చూపించిన దృశ్యాలు చూశాం

ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పచ్చ సైకోలు.. అదీ పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు

దాడి చేసి ధ్వంసం చేయించిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసులు లేవు

బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా?

కాకాణి గోవర్దన్‌, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నందిగం సురేష్‌, పోసాని కృష్ణమురళి వీళ్ల మీద అక్రమ కేసులు పెట్టారు

సీనియర్‌ జర్నలిస్టు అయిన కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు పెట్టారు

కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి లాంటి మచ్చలేని రిటైర్డ్‌ అధికారులపై కేసులు పెట్టారు

తప్పుడు వాంగ్మూలాలతోనే పైవాళ్లందరిపై కేసులు పెట్టారు

మామిడి రైతులకు నేను సంఘీభావం తెలపడం తప్పా?

ఎల్లో పేపర్లు.. టిష్యూ పేపర్లకు కూడా తక్కువే

సినిమా డైలాగులు చెబితే చంద్రబాబుకి వచ్చిన నష్టమేంటి?

సెన్సార్‌ బోర్డు ఎందుకు ఉంది?

బాలకృష్ణ, పవన్‌ సినిమాల్లో ఇంతకంటే దారుణమైన డైలాగులే ఉంటున్నాయ్‌.. మరి వాటి సంగతి ఏంటి?

కావాలనే నా సెక్యూరిటీ తగ్గించారు

ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా?

బీసీ మహిళ ఉప్పాల హారికపై దాడి దుర్మార్గం

దానవీరశూరకర్ణ కంటే గొప్పగా నటించేంది చంద్రబాబే

ప్రజాస్వామ్యంలో ఉన్నామా?.. ఇంకా ఎక్కడైనా ఉన్నామా?

చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించిన మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. భయపడేది లేదు, ప్రజల తరఫున పోరాటం ఆగేది లేదు అని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ఉద్ఘాటించారు. పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని చంద్ర‌బాబు, కూట‌మి ప్ర‌భుత్వానికి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత అన్నీ చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని తమపై అబాండాలేశారని, సీఎం చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్షా 75 వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఎవరికీ ఏ స్కీమ్ ఇచ్చింది లేదు అని, మరి ఎవరి జేబుల్లోకి డబ్బులు వెళ్లాయో తెలియదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకో అని, ఆలోచన మార్చుకో అని వైయ‌స్ జగన్ సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొడుతున్న తీరును.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన పరిస్థితులు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల పర్వం,  అక్రమ కేసులు.. అరెస్టులపై మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  

నాణానికి రెండో వైపు..
రాష్ట్రంలో ఇటీవల జరిగిన.. జరుగుతూ ఉన్నా పరిణామాల మధ్య ఈ విషయాలను మీడియా ద్వారా ప్రజలకు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్..ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాటీవీ, టీవీ 5,  ఇంకా ఎల్లోమీడియాకు సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా..నాణానికి అటువైపున వెర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరమైన నేపథ్యంలో.. ఇటీవల జరిగిన కొన్ని దారుణమైన పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉంది. 
రాష్ట్రంలో ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న వైఖరి.. పొలిటికల్ గవర్నెన్స్  అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుగారు టేకోవర్ చేసుకుని నడిపిస్తా ఉన్న తీరును.. వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి, వాతావరణం నెలకొని ఉంది. 

ఏకైక ప్రతిపక్ష పార్టీ వైయ‌స్ఆర్‌సీపీనే
రాష్ట్రంలో ఈ రోజు ప్రజాస్వామ్యం కాని, చట్టం కాని, రాజ్యాంగ మనుగడ కాని ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితలు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి.  రాష్ట్రంలో ఈ రోజు ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ..మిగిలినవన్నీ చంద్రబాబుగారితో పాటు అధికారం పంచుకుని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా.. బీజేపీ అయినా.. జనసేన అయినా.. అన్నీ కూడా అధికారంలో భాగస్తులై  అధికారంలో ఉన్న పార్టీలు.. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒక ఒక్క ప్రతిపక్ష పార్టీ.. వైయస్సార్ సీపీ.. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక్క వైయస్సార్ సీపీ పార్టీ మాత్రమే..ఎవరికి ఏ కష్టమొచ్చినా.. రైతుకు ఏ కష్టమొచ్చినా.. అక్క చెల్లెమ్మలకు ఏ కష్టం వచ్చినా.. నిరుద్యోగులకు ఏ కష్టమెచ్చినా..విద్యార్థులకు ఏ కష్టమొచ్చినా.. చివరికి ఉద్యోగులకు ఏ కష్టమొచ్చినా కూడా..
ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు చేసిన మోసాలు.. ఆయన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్..సహా 143 హామీలు తాను ఇచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి, అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తా ఉన్న ఈ సంవత్సర కాలంలో.. తన మోసాలను ఎండగడుతూ.. తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.
 ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్పప్పుడు.. ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం.. ప్రజలకు సంఘీభావంగా వారితోపాటు గొంతు కలపడం.. ప్రజలకు తోడుగా నిలబడటం.. చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష పార్టీదే. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే..ఈ అన్ని విషయాల్లో కూడా ఈ సంవత్సర కాలంలో ప్రజలకు అన్ని రకాలుగా తోడుగా నిలబడింది. ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబుగారు నెరవేర్చకపోగా.. అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తా ఉన్న నేపథ్యంలో.. 

అన్న‌దాత‌కు అండ‌గా డిసెంబ‌ర్ 13న ..
రైతులకు సంబంధించి డిసెంబర్ 13, 2024న రైతు సమస్యలకు సంబంధించిన.. తను రైతులకు ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ..  రైతన్నలకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి.. రైతన్న తరపున లేవనెత్తుతూ.. ఉచిత పంటల బీమాను తాను ఎత్తివేసిన పరిస్థితుల్లో తనను ప్రశ్నిస్తూ..సమయానికే ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీని నీరుగార్చిన పరిస్థితిలో తనను ప్రశ్నిస్తూ..2024 డిసెంబర్ 13న అన్నదాతకు అండగా.. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది. 

కరెంట్‌ చార్జీలు తగ్గించడం కాదు.. పెంచారు
డిసెంబర్ 24న కరెంట్ చార్జీల బాధుడుపై.. ఏకంగా 15 వేల కోట్ల రూపాయల బాదుడు.. ఎన్నికల సమయంలో కరెంట్ చార్జీలు తగ్గిస్తానన్న ఈ పెద్దమనిషి తగ్గించకపోగా..ఎన్నికలయిపోయిన తర్వాత  ఏకంగా సంవత్సరకాలం తిరగకముందే..ఏకంగా రూ.15 వేల కోట్లు  కరెంట్ చార్జీలను ఆయన బాదుతూ పోతే.. ఆ కరెంట్ చార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ 24న పోరుబాట నిర్వహించింది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే.. 

యువ‌త పోరు
పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటమాడుతూ.. పిల్లలకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు ఇవ్వకుండా.. చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి 12న యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ..ఈ హామీనే కాక.. నిరుద్యోగ భృతి సంగతేంటి? సంవత్సరం గడిచిపోయింది..ప్రతి  సంవత్సరం రూ.36 వేలు ఇస్తానన్నావుగా.. దాని గతేమిటి? అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ.. యువతకు తోడుగా ఉండి మార్చి 12న యువత పోరు నిర్వహించాం. 
జూన్ 4వతేదీన చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ..వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలసి చంద్రబాబు ఎగ్గొట్టిన. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలను అన్ని ఎత్తి చూపుతూ.. ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతేంటి? మీరిచ్చిన బాండ్ల సంగతేంటి అని గట్టిగా నిలదీస్తూ జూన్ 4న  వెన్నుపోటు దినం రాష్ట్రవ్యాప్తంగా చేశాం. 

చంద్ర‌బాబును నిల‌దీస్తూ..
ఇప్పుడు కూడా ఒక బృహత్తర ప్రణాళిక తీసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా కూడా రీ కాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో అన్న పేరుతో.. బాబూ షూరిటీ.. మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబునాయుడు గారు చేసిన మోసాలన్నింటినీ ఎత్తిచూపుతూ.. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ.. చంద్రబాబుగారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్లీ ఒకసారి.. వాళ్లకు తెలియజేస్తూ.. ఆ బాండ్లను టీడీపీ నాయకులకు చూపిస్తూ.. ఈ సంవత్సర కాలంలో బకాయిలను.. వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్లే లెక్కేసుకుని చంద్రబాబును అడిగేటట్టుగా.. ఈ సంవత్సరం ఎప్పుడిస్తావని చంద్రబాబును నిలదీసేటట్టుగా.. చంద్రబాబు మోసాలను ఎత్తిచూపుతూ.. జూన్ 25న రాష్ట్రస్థాయిలో నేను స్టార్ చేస్తే..జిల్లా స్థాయిలో.. నియోజకవర్గ స్థాయిలోనూ అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం. ఇప్పుడు మండల స్థాయిలో కూడా జోరుగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. జులై 21 నుంచి గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో జరిగేటట్టుగా.. చైతన్యవంతులను చేసేటట్టుగా.. క్యూఆర్ కోడ్ ద్వారా వారు డౌన్ లోడ్ చేసుకుంటే.. చంద్రబాబుగారు గతంలో అన్న మాటలు.. చంద్రబాబు గారు గతంలో ఇచ్చిన బాండ్లు.. చంద్రబాబుగారి మ్యానిఫెస్టో...ఇప్పుడు చంద్రబాబునాయుడుగారు చేస్తా ఉన్న మోసం.. చంద్రబాబునాయుడుగారు ఎంత బాకీ ఉన్నాడు.. చంద్రబాబునాయుడుగారు ఎంత ఇవ్వాల్సి ఉంది అన్న వివరాలతో.. ప్రజలే  క్యూఆర్ కోడ్ తో తమ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకునేటట్టు.. చంద్రబాబుగారిని గ్రామస్థాయిలో ప్రజలు నిలదీసేటట్టు చైతన్య వంతులను చేస్తూ ఉన్నాం..ఇలా మేము చేసే ప్రతిపనిలో కూడా ఒక కాజ్ కనిపిస్తుంది.. విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి..ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరం.. ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశం లేవనెత్తే ఒక విశాల దృక్ఫథం, విశాల ప్రజాప్రయోజనం కనిపిస్తాయి. 

ప్ర‌తీ ఒక్క‌రు వైయ‌స్ఆర్‌సీపీ త‌లుపు త‌లుపు త‌ట్టుతున్నారు
ఈ రోజు అందుకనే.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా చంద్రబాబు ఎలా చేయడూ అని చంద్రబాబును ఎవరూ కలవడం లేదు..ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఇక పోతా ఉంది..గట్టిగా కళ్లు మూసుకుంటే.. మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు..మళ్లా వచ్చేది వైయ‌స్ఆర్‌సీపీనే అని వైయ‌స్ఆర్‌సీపీ తలుపు తడుతా ఉన్నారు. వాళ్లకు జరిగిన సమస్యలను చెబుతా ఉన్నారు.. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు.. అందుకే ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తున్నాడు.. తద్వారా ప్రజల గొంతు నొక్కేయాలని చూస్తున్నాడు.. అందుకోసం విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. గతంలో మా హయాంలో పోలీసులు ఎలా ఉండేవారంటే.. అత్యుత్తమ పనితీరుతో.. సంస్కరణలతో..పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో.. తలఎత్తుకుని పోలీసులు పనిచేసే పరిస్థితులు ఉండేవి..

మాట వినకపోతే తప్పుడు కేసులు
గతంలో స్పందన అనే కార్యక్రమం ఉండేది.. అందులో వైయ‌స్ఆర్‌సీపీ వారి సమస్యలకంటే.. తెలుగుదేశం వారి సమస్యలు ఎక్కువగా పోలీసులు పరిష్కరించేవారు..కలెక్టర్లు సాల్వ్ చేసే వారు.. ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష చూపకుండా.. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది, కానీ, సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలఎత్తుకుని పనిచేసే పరిస్థితులు ఉండేవి అధికారులకు. ఈ రోజు ఆ అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే.. చంద్రబాబునాయుడుగారి  మాట ఏ పోలీసు అధికారైనా వినకుంటే..వారి పరిస్థితి ఏమిటి అంటే. డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పీఎస్ ఆర్ ఆంజనేయులు.. ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు..

తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్
చంద్ర‌బాబు నాయుడు మాట‌లు విన‌కుంటే ఈరోజు ఏ పోలీస్ అధికారి ప‌రిస్థితైనా ఏంటంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారులు పీఎస్సార్ ఆంజ‌నేయులుతోపాటు ద‌ళిత వ‌ర్గానికి చెందిన‌ పోలీసులుగా ఉన్న‌ డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్‌, మ‌రో అడిషిన‌ల్ డీజీ సంజ‌య్, డీఐజీ విశాల్ గున్నీ, బీసీ వ‌ర్గానికి చెందిన ఐజీ కాంతి రాణా టాటా త‌దిత‌రుల‌ను తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. మ‌రెంద‌రో ఎస్పీల మీద త‌ప్పుడు కేసులు పెట్టి విచార‌ణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక న‌లుగురు నాన్ కేడ‌ర్ ఎస్పీలు, ఒక క‌మాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిష‌న‌ల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు లేవు. మ‌రో ఆరుగురు డీఎస్పీలు, మూడు అడిషిన‌ల్ క‌మాండెంట్‌లు, రెండు అసిస్టెంట్ క‌మాండెంట్‌ల‌ను కూడా హెడ్ క్వార్ట‌ర్స్‌లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీల‌ను స‌స్పెండ్ చేశారు. వీరు కాకుండా మ‌రో 80 నుంచి 100 మంది ఇన్‌స్పెక్ట‌ర్లు, వంద‌ల మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు. చంద్ర‌బాబు మాట విన‌ని పోలీసుల ప‌రిస్థితి. రాష్ట్రంలో ఎంత‌టి దుర్మార్గ‌పు పాల‌న న‌డుస్తోంద‌ని చెప్ప‌డానికి ఇవ‌న్నీ ఉదాహ‌ర‌ణ‌లు. కేవ‌లం త‌న మోచేతి నీళ్లు తాగే అధికారుల‌ను మాత్ర‌మే పెట్టుకుని వారిని అవినీతిలో భాగ‌స్వాముల‌ను చేసుకుంటున్నారు. 

డీఐజీ అంటే మాఫియా డాన్‌..  
ఈరోజు రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉందంటే డీఐజీ ఆ జోన్‌కి మాఫియా డాన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న కింద సీఐలు, ఒక డీఎస్పీ ఆయ‌న ఆర్మీ. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఇసుక‌, మ‌ద్యం బెల్టు షాపులు, వాటికిచ్చే ప‌ర్మిషన్‌, పేకాట క్ల‌బ్బులు, న‌డిచే ప‌రిశ్ర‌మ‌ల నుంచి డీఐజీల ఆధ్వ‌ర్యంలో సీఐలు క‌ప్పం వ‌సూలు చేసి రివ‌ర్స్‌లో ఎమ్మెల్యేల‌కు ఇస్తున్నారు. స‌గం వీళ్లు తీసుకుని మ‌రోస‌గం చిన‌బాబు, పెద‌బాబుకి పంపుతారు. డీఐజీల‌తో అవినీతి చేయిస్తున్నారు. ఇవ‌న్నీ త‌ట్టుకోలేక సిద్దార్థ కౌశ‌ల్ వంటి యంగ‌స్ట‌ర్, యంగ్ ఐపీఎస్ ఆఫీస‌ర్ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. కేంద్రానికి వెళ్ల‌డానికి ఎన్వోసీ ఇవ్వ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబుతో ప‌డ‌లేక రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఏ ప్ర‌భుత్వంలో అయినా పోలీస్ వ్య‌వ‌స్థ గ‌ట్టిగా ఉంటే, నేర‌స్తులు రాష్ట్రాన్ని వ‌దిలి వెళ్లిపోతారు. కానీ ఇక్క‌డ మాత్రం మంచి పోలీసులు రాష్ట్రాన్ని వ‌దిలేసి వెళ్లిపోతున్నారు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా?
చంద్ర‌బాబు 40 ఏళ్ల ఇండ‌స్ట్రీ అంటున్నాడు క‌దా.. ఆయ‌న్ను ఒక‌టే అడుగుతున్నా. రాజ‌కీయ పార్టీకి మౌలికంగా ఉన్న హ‌క్కులేమిటో చంద్ర‌బాబుకి తెలియ‌దా. ఈ పెద్ద‌మ‌నిషి ఇన్నాళ్లు రాజ‌కీయాలు ఎలాచేశాడు అని అడుగుతున్నా. మీటింగులు పెట్టుకోవ‌డం, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం, ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌వంతుల్ని చేయడం, ఇవ‌న్నీ రాజ‌కీయ పార్టీల‌కు ఉన్న హ‌క్కులు కావా అని అడుగుతున్నా.  ప్ర‌భుత్వం ఏదైనా అన్యాయం, మోసం చేసినా, ప్ర‌భుత్వం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఏదైనా న‌ష్టం జ‌రిగినా దాన్ని ప్ర‌శ్నించే హ‌క్కు ప్ర‌తిప‌క్షంలో ఉన్న రాజ‌కీయ పార్టీల‌కు లేదా అని అడుగుతున్నా. 

గుడివాడలో దాడిని రాష్ట్రం మొత్తం చూసింది
ఈ రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉంది. మొన్న గుడివాడలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ మీద జ‌రిగిన దాడి దానికి ఉదాహ‌ర‌ణ. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ నా సోద‌రి ఉప్పాల హారిక మీద ఈ టీడీపీ సైకోలు.. సైకోలు అనాలో చంద్ర‌బాబు శాడిజంలో భాగ‌స్వాములైన శాడిస్టుల‌నాలో కానీ,, ఈ సైకోలు క‌ర్ర‌లతో రాళ్ల‌తో ఉప్పాల హారిక కారు మీద దాడి చేసిన ఘ‌ట‌న. ఆమె చేసిన త‌ప్పేంటని అడుగుతున్నా. ఎందుకు ఆమె మీద దాడి చేసి దుర్భాష‌లాడారు. నోటికొచ్చిన‌ట్టు అన‌రాని మాట‌ల‌న్నారు. నీ సూప‌ర్ సిక్స్ హామీలు ఏమమ‌య్యాయ‌ని చంద్రబాబు మోసాల‌ను నిల‌దీస్తూ రీకాలింగ్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో అనే కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్నారు. దాంట్లో త‌ప్పేముంది? సాయంత్రం 5 గంట‌ల‌కు ఆమె కారు మీద మొద‌లైన దాడి  6.30 గంట‌ల వ‌ర‌కు ఆమెతోపాటు ఆమె భ‌ర్త‌ను తిడుతూ కారు మీద రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడులు చేస్తూనే ఉన్నారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా పోలీసుల స‌మ‌క్షంలోనే ఈ దాడి జ‌రిగితే, పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబుని ఒక‌టే అడుగుతున్నా. ఒక బీసీ మ‌హిళ‌కు ఆత్మ‌గౌర‌వం లేదా? ఇంత‌మంది సైకోలు దారి కాచి  కారును అడ్డగించి ఆమెను, ఆమె భ‌ర్త‌ను తిడుతూ, కారు అద్దాలు ప‌గ‌ల‌గొడుతూ ప‌క్క‌న ఉన్న వారిని కొడుతూ పోలీసుల స‌మ‌క్షంలోనే హింసించారు. చేతిలో అధికారం ఉంది క‌దా అని రెచ్చిపోతుంటే చంద్ర‌బాబు ఏం చేస్తున్నారు. ఇది శాడిజం కాక ఇంకేమిటి. పైగా ఇంతటి హేయ‌మైన దాడి చేసి సిగ్గ‌లేకుండా దుర్భాష‌లాడి నాచెల్లి బీసీ మ‌హిళ‌ను మ‌హాన‌టి అని తెలుగుదేశం నాయ‌కులు మాట్లాడటానికి సిగ్గుండాలి. కారు మీద మీరు దాడి చేసి, ఆమెను మ‌హాన‌టి అంటారు. పోలీసుల ఆధ్వ‌ర్యంలో వారి స‌మ‌క్షంలో బీసీ మ‌హిళ‌, స్థానిక జెడ్పీటీసీ స‌భ్యురాలు మీద దాడి జ‌రిగితే పరిస్థితి అది. రివ‌ర్స్ లో ఆమెను మ‌హాన‌టి అంటారు. ఎవ‌రు మ‌హాన‌టులు. దాన‌వీర శూర‌క‌ర్ణ క‌న్నా గొప్ప‌గా యాక్టింగ్ చేస్తున్నాడు చంద్రబాబు. ఈ చంద్రబాబు లైవ్ యాక్టింగ్ ముందు ఎన్టీఆర్ ఎక్క‌డికో వెళ్లిపోవాలి. ఈ ఘ‌ట‌న‌లో నాగార్జున యాద‌వ్ అనే మ‌రో జెడ్పీటీసీ భ‌ర్త‌ను కూడా దారుణంగా కొట్టారు. 

ఎంత దారుణంగా హారిక మీద టీడీపీకి చెందిన శాడిస్టులు దాడి చేసిన‌ట్టుగా స్ప‌ష్టంగా వీడియోలు క‌నిపిస్తుంటే ఎంత‌మంది మీద కేసులు పెట్టారు. ఎంత‌మందిని అరెస్ట్ చేశారు.

ఎంత మందిని అరెస్టు చేశారు?
ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన శాడిస్టులు దాడి చేసినట్లు  చాలా స్పష్టంగా వీడియోలు ఉన్నా.. ఇంతవరకు ఎంత మందిపై కేసులు పెట్టారు?. ఎవరిని అరెస్టు చేయలేదు. కారణం ఏంటంటే దగ్గరుండి వీళ్లే ఫోన్లు చేసి దాడికి పంపించారు. పేర్ని నాని ఏదో సినిమా డైలాగు గురించి 11వ తేదీన మాట్లాడడని గుడివాడలో ప్రోగ్రామ్‌ జరుగుతుంది. రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్లు హాజరవుతుంటే పథకం పన్నీ దారి కాసీ, పోకముందే దారిలో అడ్డుకున్నారు.

హారిక భర్త రాముపై తప్పుడు కేసు
ఆశ్చర్యం ఏంటంటే ..కళ్లముందు కనిపిస్తున్న వీడియోను పక్కన పెట్టి హారిక భర్తపై కేసు పెట్టారు. రాము తన కారుతో ఓ మహిళను గుద్దాడని కేసు పెట్టారు. వీళ్లదరు కారు వెనుక సీట్లో కూర్చున్నారు. అది గవర్నమెంట్‌ కారు, గవర్నమెంట్‌ ఉద్యోగి కారు తోలుతుఉన్నాడు. వీళ్లు వెనుక సీట్లు కూర్చుంటే రాము గుద్దాడని తప్పుడు కేసు పెట్టారు. ఒక బీసీ మహిళకు మీరు చేసేది ధర్మమేనా? మళ్లీ వీళ్లు బీసీల గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి. ఎక్కడైనా దుమికి చావాలి.

ప్రతిపక్ష పార్టీగా కేడర్‌ మీటింగ్‌ పెట్టుకోకూడదా?
మరుసటి రోజు పేర్ని నాని, కైలా అనిల్‌కుమార్‌ సహా పెడనలో సభ పెట్టిన వారందరిపై కేసులు పెట్టారు. ఎందుకు కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా కేడర్‌ మీటింగ్‌ పెట్టుకోకూడదా? చంద్రబాబు చేసిన మోసాలను ఆ క్యాడర్‌ మీటింగ్‌లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ , రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫోస్టో..అంటూ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయకూడదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అడుగుతున్నాను.

ఇది ప్రజాస్వామ్యమేనా?
దాడుల నుంచి రక్షించడం పక్కన పెడితే, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి. ఇది సరిపోదు అన్నట్లుగా పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా? అని అడుగుతున్నాను.

చంద్రబాబు చేసే ప్రతి పనీ కూడా టాఫిక్‌ డైవర్షన్‌ ఆలోచన చేస్తున్నాను.ఈ మధ్య జరిగిన నా ప్రతి పర్యటనలో కూడా టాఫిక్‌ డైవర్ట్‌ చేస్తూ గందరగోళం సృష్టించడం, ఉద్రిక్తలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం..ఇలాంటి కుట్రలు కనిపిస్తాయి. నా పర్యటన తరువాత చంద్రబాబు దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం ఇవన్నీ కూడా ఉదాహరణలే. 

రైతులు కన్నీరు పెడుతుంటే పరామర్శించిన వాళ్లు లేరు
మిర్చిధరలు దారుణంగా పడిపోయిన సందర్భంలో ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్లాను. గతేడాది మా ప్రభుత్వంలో మిర్చి ధర రూ.21 నుంచి రూ.27 వేల ధర పలికింది. ఈ ప్రభుత్వం వచ్చాక మిర్చి ధర ఏకంగా రూ.8 నుంచి రూ.10 వేలకు పడిపోతే రైతులను పరామర్శించేవారు లేరు. ఆ రైతులకు తోడుగా, సంఘీభావంగా మద్దతు ఇస్తూ గుంటూరుకు వెళ్లింది జగనే. అది తప్పా? అలా పోయినందుకు పోలీసులు సహకరించవద్దని జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ గ్రహిత అయిన నాకు సెక్యురిటీ విత్‌ డ్రా చేస్తాడు.

ఆయనకు మూడ్‌ వస్తే జెడ్‌ ఫ్లస్‌ సెక్యూరిటీ..లేదంటే విత్‌డ్రా
ఆయనకు మూడ్‌ వస్తే సెక్యూరిటీ ఇస్తారు. లేదంటే విత్‌డ్రా చేసుకుంటాడు. అంతటితో అయిపోలేదు. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా,  రైతులను పరామర్శించి సంఘీభావం తెలిపినందుకు మళ్లీ మాపైనే కేసులు.

ఏప్రిల్‌ 8, 2025న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాప్తాడు వెళ్లాను. హెలిప్యాడ్‌ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో విండ్‌షీట్‌ దెబ్బతింటే తిరిగి మాపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ ఫైలెట్‌పై కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యటన తరువాత మా పార్టీ ఇన్‌చార్జ్‌ తోపుదుర్తి ప్రకాశ్‌పై తిరిగి కేసు పెట్టారు. మావాళ్లను వీరు చంపినా కూడా అక్కడికి మేం వెళ్లకూడదట. పరామర్శించకూడదట. ఇది ధర్మమేనా? అని అడుగుతున్నాను.

పొగాకు కొనే నాథుడు లేడు
జూన్‌ 11న ప్రకాశం జిల్లా పొదిలి..ధర లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు నేను పొదిలికి వెళ్లాను. గత సంవత్సరం పొగాకు హైగ్రేడ్‌కు రూ.360 ధర ఉంటే ఏకంగా రూ.220కి పడిపోయింది. లోగ్రేడ్‌ గతేడాది రూ.240 ఉంటే అది రూ.120కి పడిపోయింది. కొనే నాధుడు లేడు.

బ్లాక్‌ బెర్రి నిరుడు సంవత్సరం మా ప్రభుత్వంలో రూ. 180 ఉంటే ఇప్పుడు రూ.60, 90కి పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య రైతులు తల్లడిల్లిపోతుంటే పరామర్శించేందుకు నేను హాజరైతే 40, 50 వేల మంది సంఘీభావంగా వచ్చారు. చంద్రబాబు 40 మందితో వారికి 200 మంది పోలీసులతో సెక్యూరిటీ పెట్టి వాళ్లతో రాళ్లు వేయించాడు. టాఫిక్‌ డైవర్ట్‌ చేయిస్తే రైతులు సంయమనం పాటించారు. ఎటువంటి ప్రతిచర్యకు పాల్పడలేదు. అయినా ఆ తరువాత మొత్తం మూడు కేసులు పెట్టారు. 15 మంది పోగాకు రైతులను అరెస్టు చేయించి జైలుకు పంపించారు. 

మేం రైతులకు అండగా నిలబడితే మీకు వచ్చిన నష్టం ఏంటో చంద్రబాబు చెప్పాలి. మీ ప్రభుత్వం చేయాల్సింది చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేదా? ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, శాడిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది చంద్రబాబు శాడిజానికి నిదర్శనం

గతేడాది పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్‌ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళెం గ్రామానికి వెళ్లాను. ఆ ఫ్రోగ్రామ్‌కు చంద్రబాబు చేసిన రభ‌స‌ అంతా ఇంతా కాదు. నా కార్యక్రమానికి ఎవర్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం. ఆయన కార్యక్రమానికి జనాలు రాకపోతే అది ఆయన బాధ. ఆయన చేసిన మంచి ఏది లేదు. దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపు నా కార్యక్రమానికి ఎవరు హాజరుకాకుండా అడ్డుకోవడం, నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, పోలీసు స్టేషన్లు, ఇళ్లలోనే నిర్బంధిస్తూ చెక్‌పోస్టులు, లాఠీచార్జ్‌ చేశారు. కార్యక్రమానికి పోలీసు భద్రత కల్పించాల్సింది పోయి ..పోలీసులు నా కార్యక్రమానికి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు పెట్టారు. ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ తరువాత ఐదు కేసులు నమోదు చేశారు.

సినిమా డైలాగ్స్‌ను పోస్టర్లుగా ప్రదర్శించింనందుకు ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు. నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్‌ బోర్డు ఎందుకు అంగీకరించింది. బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో ఇంతకన్నా దారుణమైన డైలాగ్స్‌ ఉన్నాయి. సెన్సార్‌ బోర్డు ఉండేది ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలను కత్తరించేందుకే కదా? . నచ్చిన సినిమా డైలాగ్స్, పాటలు పాడిన తప్పేనా? ఇవన్నీ ఎందుకు? మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామీ..మూసేయండి. వీళ్లకు వచ్చిన నష్టం ఏంటో అర్థం కావడం లేదు. పాట పాడితే వచ్చిన నష్టం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నాడో తెలియడం లేదు. ఈ కేసులో 131 మందికి నోటీసులు ఇచ్చా రు. చంద్రబాబు పేరు ఎవరి చెబితే వారిని స్టేషన్‌కు పిలిపించి వేధించడం, నచ్చిన వాళ్లను విడదల వారీగా కేసుల్లో ఇరికిస్తున్నారు.వీళ్లందరినీ ఎన్నికల ముందు ఎత్తేందుకు కుట్రలు చేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి. అది సత్తా ..అలా చేసి నువు ఇలా అను..అలా అను అది సత్తా. అంతేతప్పా..నీవు అన్యాయమైన పాలన చేస్తూ..నిన్ను ప్రశ్నిస్తే అలా అన్నారు..ఇలా అన్నారని కేసులు పెట్టడం తప్పు.

నా కార్య‌క్ర‌మానికి ఎవ‌రినీ రానివ్వ‌కుండా అడ్డుకోవ‌డం, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు నోటీసులు ఇచ్చి అడ్డుకోవ‌డం, ఇళ్ల‌లోనే నిర్బంధించేలా చెక్‌పోస్టులు పెట్ట‌డం, లాఠీచార్జీలు చేయించ‌డం. స‌త్తెన‌ప‌ల్లిలో ఉద‌యాన్ని పోలీసుల లాఠీచార్జ్. నేను రాక‌ముందే. 

కార్య‌క్ర‌మానికి పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిందిపోయి. పోలీసులు నాకు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు లేరు అక్క‌డ‌. నా కార్య‌క్ర‌మానికి ఎవ‌రూ రాకుండా చూసుకునే దాని కోసం పోలీసుల‌ను పెట్టారు. ఆ కార్య‌క్ర‌మం అయిపోయిన త‌రువాత ఐదు కేసులు న‌మోదు చేశారు. 

సినిమా డైలాగులు చెప్పినా.. పోస్టర్లు ప్రదర్శించినా కేసులే
సినిమా డైలాగుల‌ను పోస్ట‌ర్లుగా పెట్టినందుకు ఇద్ద‌రిని రిమాండ్‌కు పంపారు. సినిమా డైలాగ్‌లు అంత క‌ష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాలి. ఆ డైలాగులు తీసేయండి. ఇంకా బాల‌కృష్ణ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో ఇంకా పెద్ద పెద్ద డైలాగులు క‌నిపిస్తాయి. ప్రెస్‌మీట్‌కు ముందు కొన్ని డైలాగులు చూపించారు. అవి ఇంకా దారుణంగా ఉన్నాయి. నీకు డైలాగులు న‌చ్చ‌క‌పోతే సెన్సార్‌లో తీసేయండి. సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు..? అంతేకానీ సినిమా రిలీజ్ అయిన త‌రువాత ఆ సినిమా డైలాగులు, మంచి పాట‌లు స‌హ‌జంగానే ప్ర‌సిద్ధి చెందుతాయి. సినిమాలో మంచి పాట ఉంటే ఆ పాట పాడినా త‌ప్పే అంటావ్‌.. ఆ సినిమాలో మంచి డైలాగ్ న‌చ్చితే.. వాటిని పోస్ట‌ర్లుగా పెట్టినా త‌ప్పే, మాట్లాడినా త‌ప్పే.. వాళ్లు చేసిన యాక్ష‌న్ వీళ్లు చేసినా త‌ప్పే.. అలాంట‌ప్పుడు మ‌రి సినిమాలు ఎందుకు తీస్తున్నారు.. ఆపేసేయండి, మూసేయండి. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా.. లేదా అనేది నిజంగా ఆలోచ‌న చేసుకోవాలి మ‌న‌మంతా. 

సినిమా డైలాగులు రాసుకుంటే రాసుకున్నాడు.. పాట పాడితే పాడాడు.. డైలాగులు కొడితే కొట్టినాడు వీళ్ల‌కు వ‌చ్చిన న‌ష్టం ఏంటీ..? గుమ్మ‌డికాయ‌ల దొంగ అంటే భుజాలు త‌డుముకున్న‌ట్లుగా ప్ర‌తీది వాళ్లు ఏమ‌న్నా.. నిన్నే అన్న‌ట్లుగా నువ్వెందుకు బాధ‌ప‌డుతున్నావ్‌..? 

సినిమా డైలాగుల‌ను పోస్ట‌ర్లుగా పెట్టినందుకు ఇద్ద‌రిని రిమాండ్‌కు పంపించారు. 131 మందికి నోటీసులు ఇచ్చారు. చంద్ర‌బాబు పేరు ఎవ‌రు చెబితే వారిలో ఒక్కొక్క‌రిని పిలిపించుకోవ‌డం, రోజంతా కూర్చోబెట్టుకోవ‌డం, వేధించ‌డం. చార్జ్‌షీట్లు గ‌మ‌నిస్తే అండ్ అద‌ర్స్ అని ఖాళీగా వ‌దిలిపెడ‌తారు. అంటే వారికి న‌చ్చిన వారిని ఇనిస్టాల్‌మెంట్ బేసిస్ మీద ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇరిక్కించేదాని కోసం. 

స్థానిక ఎన్నిక‌లు, మ‌రో ఎన్నిక ఏదైనా వ‌చ్చిన‌ప్పుడు అద‌ర్స్ అంద‌రినీ జాయిన్ చేపించి, అంద‌రినీ ఎల‌క్ష‌న్స్ ముందు ఎత్తడం. ఎందుకు ఇంత కుట్ర‌లు చేస్తున్నారు. ప్ర‌జాస్వామ్యంలో మంచి చేసి ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెలుచుకొని పాల‌న చేయాలి. అది స‌త్తా... అలా చేసి నువ్వు ఇలా అను (పుష్ప మ్యానరిజం) అది స‌త్తా.. 

అంతేత‌ప్ప‌.. నువ్వు అన్యాయ‌మైన పాల‌న చేస్తూ, నిన్ను ఎవ‌డైనా ప్ర‌శ్నిస్తే వాళ్లు అలా అన్నారు. వీళ్లు ఇలా అన్నార‌ని, అలా మాట్లాడారు, ఇలా మాట్లాడార‌ని తీసేయ‌డం స్టేష‌న్‌లో పెట్ట‌డం ఏంటిది..?

చివ‌ర‌కు పోలీసుల దారుణాలు నిజంగా ఏ స్థాయిలోకి వెళ్లిపోయాయంటే.. పోలీస్ అట్రాసిటీ వ‌ల్ల త‌న కొడుకు చ‌నిపోతే, ఆ చ‌నిపోయిన వ్య‌క్తి మా లీడ‌ర్‌, ఉప స‌ర్పంచ్‌. చ‌నిపోయిన మా లీడ‌ర్ తండ్రిని ప‌రామ‌ర్శించేందుకు వాళ్లింటికి నేను వెళ్లాను. ఎంతటి దారుణ‌మంటే.. పోలీస్ అట్రాసిటీ వ‌ల్ల చ‌నిపోయిన వ్య‌క్తిని బెట్టింగ్ కేసులో చ‌నిపోయార‌ని, బెట్టింగ్ బ్యాచ్‌లో కేసు క‌ట్టారు. ఉప స‌ర్పంచ్ బెట్టింగ్ అంట‌.. దొంగ కేసులు పెట్ట‌డంలో ఏమైనా ప‌ద్ద‌తా..? చంద్ర‌బాబు అనే వ్య‌క్తి మాన‌వ‌త్వం మ‌రిచిపోయి ఈ మాట‌ల‌న్నీ తానే మాట్లాడుతున్నాడు. 

మ‌రొక ఉదాహ‌ర‌ణ‌.. ధ‌ర‌ల్లేక తీవ్ర క‌ష్టాల్లో మామిడి రైతులు ఉంటే.. మామిడి రైతుల‌కు సంఘీభావంగా జూలై 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళెం నేను వెళ్లా. ఇదే  మామిడి రైతుల ప‌రిస్థితి గ‌త సంవ‌త్స‌రం వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు గ‌త సంవ‌త్స‌రం మామిడి తోతాపురి మామిడి రూ.25 నుంచి రూ.29 కేజీ. ఈ సంవ‌త్స‌రం చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ప‌రిస్థితి రూ.2.5 - రూ.3 ప‌డిపోయిన ప‌రిస్థితులు. రూ.2కే కేజీ మామిడి దొరుకుతుందంటే.. రైతుల ప‌రిస్థితి ఏమిటి..? 

మాములుగా మే నెల 10-15 తేదీల మ‌ధ్య తెర‌వాల్సిన ప్రాసెసింగ్ ఫ్యాక్ట‌రీల‌ను జూన్ రెండో వారం, మూడో వారం అయినా కూడా తెర‌వ‌లేదు. నెల ఆల‌స్యంగా తెర‌వ‌డం వ‌ల్ల పంట ఒకేసారి మార్కెట్‌లోకి వ‌చ్చింది. స‌ప్ల‌య్ ఎక్కువ కావ‌డంతో రేటు ప‌డిపోయింది. రేట్ ప‌డిపోవ‌డంతో రైతు న‌ష్ట‌పోయాడు. ఇదీ జ‌రిగిన వాస్త‌వం. త‌ప్పిదం ఎవ‌రిది.. మ్యాన్ మేడ్ ఎర్ర‌ర్ కాదా ఇదీ. 

చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు సంబంధించి బినామీలు గ‌ల్లా ఫుడ్స్‌, శ్రీ‌ని ఫుడ్స్, త‌న వాళ్ల‌కు సంబంధించిన ఫ్యాక్ట‌రీల‌కు మేలు చేసేందుకు కాదా ఇదంతా చేస్తున్న‌ది ద‌ళారీ వ్య‌వ‌స్థ‌. ఎంత‌మంది రైతుల‌కు కేజీ రూ.12 వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నా. రూ.12 అనేదే అతి త‌క్కువ ధ‌ర‌. గ‌త సంవ‌త్స‌రం కేజీ రూ.25-రూ.29కి అమ్మారు. 

క‌ర్ణాట‌క రూ.16కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ కొనుగోలు చేస్తుంద‌ని కేంద్రమంత్రి లేఖ రాసి సెంట్ర‌ల్ విల్లింగ్‌నెస్ తెలిపితే.. నువ్వు ఇక్క‌డ రూ.12 కేజీ అని సిగ్గులేకుండా చెబుతున్నావ్‌. ఆ రూ.12 అయినా ఎంత‌మందికి ఇచ్చారంటే అదీ లేదు. 

2.20 ల‌క్ష‌ల ఎక‌రాలు, 6.5 ల‌క్ష‌ల ట‌న్నుల పంట‌, 76 వేల కుటుంబాలు చంద్ర‌బాబు నాయుడు పుణ్యాన అల్లాడిపోయే ప‌రిస్థితి రైతుల‌కు వ‌స్తే, సంఘీభావం తెల‌ప‌డం కోసం నేను అక్క‌డికి వెళ్తే.. అది త‌ప్పా.. నేర‌మా అని చంద్ర‌బాబును అడుగుతున్నా..

బంగారు పాళెంలో నా ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయ్యే స‌రికి గ్రామ‌స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయ‌కుల వ‌ర‌కు ఏకంగా 2 వేల మందికి పైగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఎందుకు ఇచ్చారు.. అని ప్ర‌శ్నిస్తున్నా.. రైతుల‌కు సంఘీభావం తెల‌ప‌డానికి నేను వెళ్ల‌డం త‌ప్పా..? ఆ కార్య‌క్ర‌మంలో రైతులు పాలుపంచుకోవ‌డం త‌ప్పా..? 2 వేల మందికి నోటీసులు, వంద‌ల మందిని నిర్బంధించారు. ముగ్గురు ఎస్పీలు, 9మంది డీఎస్పీలు, 2 వేల మంది పోలీసులు, చెక్‌పోస్టులు. ప్ర‌తి గ్రామానికి చెక్‌పోస్ట్‌, ప్ర‌తి సందుకు చెక్‌పోస్ట్‌. వీరంతా నా సెక్యూరిటీ కోసం కాదు.. నా కార్య‌క్ర‌మానికి ఎవ‌రూ రాకుండా చూసుకునేందుకు పెట్టారు. రైతులు, ప్ర‌జ‌ల‌ను నిర్బంధించేందుకు ఏర్పాటు చేశారు. చివ‌ర‌కు పెట్రోల్ బంకుల‌కు కూడా నోటీసులు. బైకుల‌కు పెట్రోల్ పోయ‌కూడ‌ద‌ని నోటీసులు ఇచ్చారు. 

అయినా కూడా క‌డుపు మండిన రైతులు వేలాదిగా త‌ర‌లివ‌చ్చారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరును దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు మామిడి పండ్ల‌ను రోడ్ల మీద వ‌దిలేసి, నా కార్య‌క్ర‌మంలో నాతో పాటు క‌లిశారు. ఆ ప్రోగ్రాంకు వెళ్లినందుకు 5 కేసులు పెట్టారు. 20 మందిని అరెస్టు చేశారు. రైతుల కోసం, రైతుల త‌ర‌ఫున‌, రైతుల‌కు సంఘీభావం తెల‌ప‌డం కోసం వెళ్లిన ప్రోగ్రాం. 

ఇదేమో నేరం అన్న‌ట్లుగా రైతుల‌ను, ప్ర‌తిప‌క్షాన్ని ప‌ట్టుకొని రౌడీషీట‌ర్లుగానూ, అసాంఘిక శ‌క్తులుగానూ, దొంగ‌లుగానూ వ‌క్రీక‌రించి, చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

ఈనాడు పేప‌ర్ చూస్తే.. అది పేప‌రా.. టాయిలెట్ పేప‌రా..? టాయిలెట్ పేప‌ర్‌కు ఎక్కువ టిష్యూ పేప‌ర్‌కు త‌క్కువ‌. అదో పేప‌రా.. పేప‌ర్‌కు ప‌ట్టిన పీడా..? రైతులంతా రేటు ఉంద‌ని ఆనందంగా కేరింత‌లు కొడుతున్నారంట‌. రైతుల‌కు ధ‌ర‌ల్లేక ఇబ్బందులు ప‌డుతుంటే.. కేరింత‌ల‌ని రాస్తున్నారు. రైతుల‌కు రేటు రాక‌నే రూ.12 డిక్లేర్ నువ్వు డిక్లేర్ చేసిన‌వ్‌. రూ.4 రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఇవ్వాల‌ని, ఇచ్చిన క‌థ‌న దేవుడెరుగు క‌నీసం ప్ర‌క‌ట‌న చేశావ్‌. మ‌ళ్లీ ఈనాడు రాస్తున్నాడు.. బ్ర‌హ్మాండ‌మైన రేట్ల‌తో రైతులు కేరింత‌లు కొడుతున్నారంట‌. రైతులంతా నా మీద పోరాటం చేసిన‌ట్లుగా రాస్తున్నాడు. ఈనాడును ఎమ‌నాలి.. పేప‌రా, పేప‌ర్‌కు ప‌ట్టిన పీడ‌నా.. 

పాపం రైతులు మామిడి పండ్ల‌ను రోడ్డు మీద వేసి నా కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. రైతులు మామిడి పండ్ల‌ను రోడ్ల మీద వేసినందుకు వాళ్ల‌పైన కేసులు పెట్టారు. 

ఇక‌పై రాష్ట్రంలో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని రోడ్డెక్కే ప‌రిస్థితి ఏ ఒక్క రైతుకూ ఉండ‌కూడ‌ద‌ని, రాష్ట్రంలో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని రోడ్డెక్కే ప‌రిస్థితి ఏ ఒక్క నిరుద్యోగ యువ‌కుడికి గానీ, ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ పొందే విద్యార్థుల‌కు గానీ, ఏ ఒక్క‌రికీ ఆ హ‌క్కు ఉండ‌కూడ‌ద‌ని, రాష్ట్రంలో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని రోడ్డెక్కే ప‌రిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి, ఏ ఒక్క మ‌హిళ‌కు ఉండ‌కూడ‌ద‌ని, తాను ఎన్నిక‌ల‌ప్పుడు ఇచ్చిన హామీల‌ను సూప‌ర్ సిక్స్‌ల‌ను, సూప‌ర్ సెవెన్‌ల‌తో స‌హా 143 హామీల‌ను తాను నెర‌వేర్చేశాన‌ని, ప్ర‌జ‌లంతా ఆనందంగా కేరింత‌లు కొడుతున్నార‌ని మాత్ర‌మే భావించాలంట‌. అది చంద్ర‌బాబు ఉద్దేశం

లేదు, కాదు, కుద‌ర‌దు, ఇది మోసం, అన్యాయం అని ప్ర‌శ్నిస్తే త‌ప్పుడు కేసులు, త‌ప్పుడు వాంగ్మూలాలు, వెంట‌నే వ‌క్రీక‌ర‌ణ‌లు. అస‌లు నిజంగా పాల‌కుడు అని చెప్పుకోవ‌డానికి చంద్ర‌బాబు నాయుడు అనే వ్య‌క్తికి సిగ్గుండాలి. ప‌త్రిక‌లు, టీవీలు అని చెప్పుకునేదానికి ఎల్లో మీడియాకు సిగ్గుండాలి.

బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా?
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిన పరిస్థితులు ఉన్నాయో చెబుతున్నా....  ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు చెబుతున్నా..అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాను తన సొంత ఇంటికి.. నియోజకవర్గ కేంద్రం తాడిపత్రిలో తన సొంత ఇల్లు ఉంది..తన సొంత ఇంటికి తాను వెళ్ల లేని పరిస్థితి..కోర్టు ఆదేశాలున్నా.. ఎప్పుడు ఆయన తన ఇంటికి వెళ్లాలని ప్రయత్నించినా పోలీసులే అడ్డుకుంటారు.. సీఐ యే గన్ కూడా చూపిస్తాడు.. బీహార్ లో ఉన్నామా..? లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము..ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనేది.. నిజంగా చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి.. తాలూకా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న తన సొంత ఇంటికి కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా వెళ్లకుండా.. పోలీసులే తుపాకులు చూపించి బెదిరిస్తూ ఉన్నారంటే..   
ఆరుసార్టు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. ఆరుసార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు..పచ్చ శాడిస్టులు..పోలీసుల సమక్షంలోనే..ఇద కూడా ఆశ్చర్యం.. పోలీస్ సైరన్ వినపడుతోంది.. ఒకవైపున.. మరోవైపున ఇళ్లలోకి పోయే వాడు  పోతా ఉన్నాడు..ధ్వంసం చేస్తా ఉన్నాడు..ప్రసన్న ఎక్కడా అని ప్రశ్నిస్తా ఉన్నాడు..ఆడేడి ఈడేడి అని అడుగుతా ఉన్నారు..ఇల్లు నాశనం చేస్తున్నారు..ఉండుంటే మనిషిని చంపేసుండురు. కారును బోల్తా తిప్పించేశారు.. 
నిజంగా అదృష్టవశాత్తు.. ప్రసన్న ఇంట్లో లేడు.. ప్రసన్న ఇంట్లో ఉండుంటే.. 
దాడి చేయించినా.. ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ.. వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు..అరెస్టులు లేవు.. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసులు పెట్టారు.. బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి..పోలీసులు చూస్తూ ఊరుకుంటారు.. ఒక అరెస్టు ఉండదు.. తరువాత ఎటువంటి చర్యలు ఉండవు.. తిరిగి బాధితుడి మీదనే ఎదురు కేసులు.  నేను అడుగుతా ఉన్నా.. ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్లు? ఇది శాడిజం కాదా? ఫైశాచికత్వం కాదా ? అని అడుగుతా ఉన్నా..

చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకువచ్చాడు.. దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఒక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు.. ప్రసన్న అన్న విషయమే కాదు..కాకాణి గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి..సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. వీళ్లే కాక 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి.. లాంటి తమ జీవితంలో మచ్చ లేని రిటైర్డ్ అధికారులు వీరు.. వారి కెరియర్ మొత్తంలో కూడా.. ఇలాంటి వాళ్లను కూడా ... వీరు కాక ఇంకా ఎంతో మంది అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తా ఉన్నారు.. అన్ని కేసులకు ఒకటే మోడస్ ఆపరాండీ..
ఆ మోడస్ ఆపరాండీ ఏంటీ అంటే.. తప్పుడు వాంగ్మూలాలు..వీళ్లకి కావాల్సిన వాంగ్మూలం.. వీళ్లు చెప్పిన ప్రకారం.. తప్పుడు వాంగ్మూలాలు ఎవరో ఒకరి దగ్గర  తీసుకోవడం.. వారిని ప్రలోభపెట్టడమో..భయపెట్టడమో.. ఏదో ఒకటి చేయడమో.. తప్పుడు వాంగ్మూలాలు వాళ్ల దగ్గర నుంచి వీళ్లకి కావాల్సిన వెర్షన్ తీసుకోవడం.. ఇదే మోడస్ ఆపరాండీ. ఈ దేశంలో ఎవరినైనా అరెస్టు చేయొచ్చు ..అని చంద్రబాబు చూపిస్తా ఉన్నాడు.. మోడీనైనా అరెస్టు చేయొచ్చు.. అమిత్ షానైనా అరెస్టు చేయొచ్చు..నో ఎగ్జంప్షన్స్..కావాల్సిందల్లా..ఎవరో ఒకరు బీజేపీ కార్యకర్తను తెలుగుదేశం పార్టీలోకి కండువా కప్పి తీసుకోవడం..వానితో మోడీ ఇవన్నీ చేయించాడని చెప్పించడం.. మోడీపై కేసు పెట్టడం..ఇంతే..మోడస్ ఆపరాండీ ఇది అంతే..ఎవరిమీద అయినా గానీ ఇదే మోడస్ ఆపరాండీ..
నేను అడుగుతా ఉన్నా.. ఇదే సాంప్రదాయం.. ఇది వైయస్సార్ సీపీ అధ్యక్షుడిపైనైనా సరే.. మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉన్న నాయకులపైనైనా సరే...చివరకు సోషల్ మీడియా కార్యకర్తలమీదైనా సరే కూడా ఇదే.. 
తప్పుడు ఫిర్యాదులు,, తప్పుడు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం.. ఇంకా పెడుతూనే ఉన్నారు.. నేను అడుగుతా ఉన్నాను..ఇదే సాంప్రదాయం..రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత..దెబ్బ తగిలిన వీళ్లు..దెబ్బలు తిన్న వీళ్లు ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేయడం మొదలు పెడితే.. మీ పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నా.. తెలుగుదేశం పార్టీని..
చంద్రబాబుగారు వేసిన తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయం గాన మానకపోతే .. ఎవరి చేతిలోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తున్నాడు. చంద్రబాబునాయుడుగారు..ఈ రోజు దెబ్బతగిలిన ప్రతి ఒక్కడూ రేపొద్దున్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కొనసాగిస్తే.. చంద్రబాబు పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈ రోజున పైన మీరు ఉన్నారు.. మళ్లా నాలుగేళ్లకో.. మూడేళ్లో కిందకు మీరొస్తారు..మేము పైకి పోతాం..కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం..రేపు విష వృక్షం అవుతుంది. 
నేను చెప్పినా కూడా మావాళ్లు వినే పరిస్థితి ఉండదు.. దెబ్బతగిలినవాడికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో.. తప్పు తెలుసుకో.. తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో..
ఇవన్నీ చంద్రబాబు నాయుడుగారు ఎందుకు చేస్తా ఉన్నారో మనకు తెలిసిన విషయాలే..సూపర్ సిక్స్..సూపర్ సెవన్ లు అని ఆయన అన్నాడు..వీటి అమలు గురించి ఎవరూ అడగకూడదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్లు పీకేశారు. దాని గురించి ఎవరూ మాట్లాడకూడదు..గత ఏడాది ఎగరగొట్టి.. ఈ ఏడాది జూన్ 21న రైతు భరోసా ఇస్తామన్నారు.. ఇంతవరకు అతీ గతీ లేదు.. ఇప్పుడు దాని గురించి ఎవరూ అడగకూడదు.. మాట్లాడకూడదు..ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడు అంటే ఇందుకే ..
ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18 వేలు చొప్పున ఇస్తామన్నారు..గత ఏడాది ఎగరగొట్టాడు.. ఈ ఏడాది అంతే.. దానిగురించి ఎవరూ మాట్లాడకూడదు.
ఏటా 3 సిలెండర్లు అన్నాడు.. గత ఏడాది రెండు సిలెండర్లు ఎగరగొట్టేశారు.. ఇస్తానన్న ఆ ఒక్క సిలెండరు కూడా అందరికీ అందలేదు.. ఈ ఏడాది అసలే 3 సిలెండర్లలో అసలే లేదు.. దీని గురించి ఎవరూ అడగకూడదు..ప్రశ్నాంచకూడదు..
బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తా అన్నాడు. గత ఏడాది ఎగరగొట్టేశాడు.. 15 వేలు కాస్తా రూ.13 వేలు అయింది..ఈ ఏడాది కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టేశాడు. దీన్ని కూడా ఏ విద్యార్థి ప్రశ్నాంచకూడదు.. అడగకూడదు..నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తా అన్నాడు..
ఏడాదికి రూ.36 వేలు చొప్పున నిరుద్యోగ బృతి అన్నాడు.. గత ఏడాది ఎగ్గొట్టేశాడు..ఈ ఏడాది ఎగ్గొట్టడానికి శ్రీకారం చుట్టాడు. ఎవరూ దీని గురించి    అడగకూడదు..ప్రశ్నించకూడదు. 50 ఏళ్లు దాటితే పెన్షన్ అన్నాడు.. 50 ఏళ్లు దాటితే 48 వేలు మీ చేతిలో పెడతా అన్నాడు.. గత ఏడాది ఎగ్గొట్టాడు.. ఈ ఏడాది ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఎవరూ అడగకూడదు..ప్రశ్నించకూడదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎన్నికలప్పుడు ఏమన్నాడు..వైజాగ్ షికారుకైనా పోవచ్చన్నాడు..శ్రీకాకుళం వాళ్లు తిరుపతికైనా రావచ్చు అన్నాడు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవచ్చంటాడు. తిరుపతి వాళ్లు రాయలసీమవాళ్లు విశాఖపట్నానికి షికారుకు పోవచ్చంటాడు.అక్కడ సింహాచలం గుడికైనా పోవచ్చంటాడు. ఈ రోజు ఎక్కిడికి వెళ్లినా ఫ్రీ బస్ కాస్తా.. సంవత్సరమైపోయింది.. ఆ బస్ హామీ గాలికెగిరిపోయింది. ఇంకా అమలు కాలేదు. ఈయన పండగల మీద పండగలు డేట్లు చెబుతా ఉన్నాడు.పండగలు గడిచిపోతూ ఉన్నాయి..డేట్ మాత్రం రావడం లేదు.. అయినా ఎవరూ దీనిపై ఎవరూ అడగకూడదు..మాట్లాడకూడదు..

సూప‌ర్ సిక్స్ సూప‌ర్ సెవెన్ మాత్ర‌మే కాదు. చంద్ర‌బాబు పుణ్యాన పిల్ల‌లు చ‌ద‌వులు మానేసి ప‌నుల‌కు పోతున్న ప‌రిస్థితి రాష్ట్రంలో ఉంది. ఆయ‌న పుణ్యాన ఆరు త్రైమాసికాల‌కు సంబంధించి ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ పెండింగ్‌. 2024 జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి-మార్చి త్రైమాసికం నుంచి మొద‌లుపెడితే ఈరోజు జూన్ 30కి లెక్క‌క‌డితే ఆరు త్రైమాసికాలకు సంబంధించి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున రూ. 4,200 కోట్లు బ‌కాయిలు. దీంతోపాటు వ‌స‌తి దీవెన కింద ప్ర‌తి ఏప్రిల్‌లో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇప్ప‌టికి రెండు ఏప్రిల్‌లు గ‌డిచిపోయాయి. వ‌స‌తి దీవెన, విద్యాదీవ‌న బ‌కాయిలు రెండూ క‌లిపితే రూ. 4200 కోట్లు ప్ల‌స్ రూ. 2200 కోట్లు మొత్తం రూ. 6400 కోట్లు కాగా ఇచ్చింది కేవ‌లం రూ. 750 కోట్లు మాత్ర‌మే. వీటి గురించి కూడా ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌దు. 

ఆరోగ్య‌శ్రీ , ఆరోగ్య ఆస‌రా కింద బకాయిలు రూ.4500 కోట్లు దాటిపోయాయి. ఆరోగ్య‌శ్రీకి నెల‌కు నెల‌కు రూ. 300 కోట్లు ఖ‌ర్చ‌వుతాయి. 13 నెల‌ల‌కు లెక్కేసుకుంటే దాదాపు 4 వేల కోట్లు. ఆరోగ్య ఆస‌రా కింద మ‌రో రూ. 500 కోట్లు ఖ‌ర్చ‌వుతాయి. పేద‌వాడికి ఉచితంగా వైద్యం అంద‌ని ప‌రిస్థితి. నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రులు చేతులెత్తేసిన ప‌రిస్థితి. అయినా వీటి గురించి ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడదు. ఆయ‌న ఇచ్చిన 143 హామీల గురించి కూడా ఎవ‌రూ నిల‌దీయ‌కూడ‌దు. 
అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చంద్ర‌బాబు తొల‌గించిన ఉద్యోగాలు 3 ల‌క్ష‌ల పైచిలుకు ఉన్నాయి. 2.66 ల‌క్ష‌ల వ‌లంటీర్ లని  మోసం చేసి ఎన్నిక‌ల‌ప్పుడు వాడుకుని ఆ త‌ర్వాత వారి కుటుంబాల‌ను రోడ్డున ప‌డేశాడు. బేవ‌రేజెస్ కార్పొరేష‌న్‌లో మ‌రో 15 వేల మందిని, ఎండీయూ వాహ‌నాల ద్వారా రేష‌న్ డోర్ డెల‌వ‌రీ చేస్తున్న 20 వేల మందిని తొల‌గించారు. ఇలా 3 ల‌క్ష‌ల కుటుంబాల‌ను రోడ్డున ప‌డేశాడు.  

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చేసిన మోసం అంతా ఇంతా కాదు. వ‌స్తూనే ఐఆర్ అన్నాడు ఎగురకొట్టాడు. అంత‌కుముందున్న పీఆర్సీ ర‌ద్దు చేసి కొత్త‌ది వేయలేదు. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక నాలుగు డీఏలు పెండింగ్‌. మేం అధికారంలోకి వ‌చ్చాక ఉద్యోగుల‌కు మంచి చేస్తూ జీపీఎస్‌ తీసుకొస్తే దాన్ని తీసేసి ఓపీఎస్ తెస్తాన‌ని మోసం చేశాడు. ఉద్యోగుల‌కు బకాయిలే ఇప్పుడు రూ. 20 వేల కోట్లు దాటాయి. అడిగితే తోక‌లు క‌ట్‌. ఎవ‌రూ అడ‌గ‌కూడ‌దు. అడిగితే వారి మీద త‌ప్పుడు కేసే. 

చివ‌రికి గ్రామ వార్డు స‌చివాల‌యాలు పూర్తిగా నిర్వీర్యం అయిపొయాయి. దాని గురించి ఎవ‌రూ నోరెత్త‌కూడ‌దు. 24 గంట‌ల్లో ధాన్యం కొనుగోలు డ‌బ్బులు ఇస్తామ‌న్నారు. ఏప్రిల్ నుంచి బ‌కాయిలు రూ. వెయ్యి కోట్లు పైనే ఉన్నాయి. అయినా ఎవ‌రూ అడ‌గ‌కూడ‌దు. 

రాష్ట్రాన్ని మేము శ్రీలంక చేస్తున్నామ‌ని మా మీద బండ‌లు వేశారు. ఈయ‌న 13-14 నెల‌ల కాలంలోనే తీసుకొచ్చిన అప్పులు రూ. 1,75,112 కోట్లు. అన్ని స్కీములిస్తూ, నాడు నేడు  లాంటి గొప్ప అభివృద్ధి కార్యక్ర‌మాలు చేస్తూ మా ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో చేసిన అప్పు రూ. 3,32,671 కోట్లు. స్కూళ్లు, ఆస్ప‌త్రుల రూపురేఖ‌లు మారుస్తూ, కొత్త‌గా ప్ర‌భుత్వ రంగంలో మూడు పోర్టులు కడుతూ, కోవిడ్ లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటూ మేం  చేసిన అప్పులు కేవ‌లం రూ. 3,32,671 కోట్లయితే అవేవీ లేకుండానే 13 నెల‌ల్లో చంద్రబాబు చేసిన అప్పులు రూ. 1,75,112 కోట్లు. మేం ఐదేళ్ల‌లో చేసిన మొత్తం అప్పుల్లో 52.43 శాతం ఇప్ప‌టికే చేసేశాడు. ఈ డ‌బ్బంతా ఎవ‌రి జేబుల్లోకి వెళ్తుంద‌ని నేను అడుగుతున్నా. ఎవ‌రికీ ఒక స్కీం ఇచ్చింది లేదు. ఎవ‌రికీ ఏ మంచి చేయ‌కుండా ఈ డ‌బ్బంతా ఎవ‌రి జేబుల్లోకి వెళ్లిన‌ట్టు? అయినా ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌దు. అడిగితే త‌ప్పుడు కేసులు. షాక్ కొట్టేలా పెంచిన విద్యుత్ చార్జీలు ఏకంగా రూ. 18272 కోట్లు. క‌రెంట్ చార్జీలు త‌గ్గిస్తామ‌న్న క‌థ దేవుడెరుగు ఈ 13 నెల‌ల్లోనే క‌రెంట్ చార్జీలు ఏకంగా రూ. 18272 కోట్లు పెంచేశాడు. మేం ఉద్య‌మం చేసిన‌ప్పుడు 15 వేల కోట్ల‌యితే ఇప్పుడ‌ది రూ. 18 వేల కోట్ల‌కు ఎగ‌బాకింది. ఫ్యుయ‌ల్ అండ్ ప‌వ‌ర్ ప‌ర్చేజ్ కాస్ట్ అడ్జ‌స్ట్‌మెంట్ (FPPCA)కింద ర‌క‌ర‌కాల తేదీల్లో ఆయ‌న ఇచ్చిన బాదుడు రూ. 18,272 కోట్లు. దీని గురించి ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌దు. 

చంద్రబాబు నాయుడు పుణ్యాన అమూల్ మూత‌ప‌డుతూ ఉంది. రైతులు తెచ్చే పాలకు గిట్టుబాటు ధ‌ర‌లు త‌గ్గాయి. కానీ మార్కెట్‌లో వీరు ఏర్పాటు చేసిన హెరిటేజ్ కార్ట‌ల్‌కి మాత్రం ధ‌ర‌లు పెరిగాయి. ఇలా పాల ధ‌ర‌లు పెరిగినా ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌దు. రైతుల‌కు న‌ష్టం జ‌రిగినా ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌దు. అమాంతం స్కూల్ ఫీజులు పెరిగినా, పెరిగిన బ‌తుకుభారం గురించి ఎవ‌రూ అడ‌గ‌కూడ‌దు. పొర‌పాటున ప్ర‌శ్నిస్తే సుమా  త‌ప్పుడు కేసుల‌కు బ‌లికావాల్సిందే. స్కూళ్లు, ఆస్ప‌త్రుల్లో నిలిచిపోయిన నాడు-నేడు ప‌నుల గురించి ఎవ‌రూ అడ‌గ‌కూడ‌దు. స్కాములు చేస్తూ త‌మ వారికి తెగ‌న‌మ్ముతున్న మా హ‌యాంలో కొత్త‌గా తీసుకొచ్చిన ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల గురించి.., పోర్టులు, 
ఫిషింగ్ హార్బ‌ర్లు తెగ‌న‌మ్ముతూ స్కాములు చేస్తున్నా ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌దు. ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా చేస్తున్నా మాట్లాడ‌కూడ‌దు. గ్రామ స్థాయి నుంచి జ‌రుగుతున్న లిక్క‌ర్ మాఫియా, మ‌ట్టి మాఫియా గురించి ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌దు. రాజ‌ధాని ప్రాంతంలో చ‌ద‌ర‌పు అడుగు రూ. 9- 10 వేల‌త నిర్మాణాలు జ‌రుగుతున్నాయి. ఈ రేట్లు చూస్తే బంగారంతో క‌డుతున్నారేమో అనిపిస్తుంది.  
రేట్లు అమాంతం పెంచేసి, ఇంత‌కుముందు ఎప్పుడూ లేనిది మొబిలైజేష‌న్ అడ్వాన్సు పేరుతో కొత్త‌గా మొద‌లుపెట్టారు. మొబిలైజేష‌న్ అడ్వాన్సు 10 శాతం ఇచ్చి 8శాతం ఎత్తేస్తున్నారు. నాణ్య‌త లేని ప‌నులు జ‌రుగుతున్నా ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌దు. లూలూ, ఉర్సా లాంటి వాళ్ల‌కు రూపాయికే కారు చౌక‌గా భూములిస్తున్నా ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌దు. గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌ని విధంగా రాష్ట్రానికి మంచి చేస్తూ మేం రూ. 2.49 ల‌కు పీపీఏలు చేసుకుంటే నానాయాగీ చేసిన వీరు ఈరోజున రూ. 4.60 ల‌కు పీపీఏ చేసుకున్నా ఎవ‌రూ నోరెత్తి ప్ర‌శ్నించ‌కూడ‌దు. రాష్ట్ర వ్యాప్తంగా హ‌త్య‌లు, హ‌త్యాయ‌త్నాలు, దౌర్జ‌న్యాలు, ఆడ‌పిల్ల‌ల మీద అఘాయిత్యాలు చేసినా మాట్లాడ‌కూడ‌దు. ప్రశ్నించ‌కూడ‌దు. అడిగితే ప్ర‌శ్నిస్తే త‌ప్పుడు కేసులే. 

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుకి ఒక‌టే చెబుతున్నా. ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టినా మేం ఆగేది లేదు. ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టినా భ‌య‌పడేది లేదు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున మా పోరాటం ఆపేది లేదు. కళ్లు మూసి తెరిస్తే మీ ప్ర‌భుత్వం మ‌హా అయితే మ‌రో మూడేళ్లు ఉంటుంది. త‌ర్వాత మ‌ళ్లీ వ‌చ్చేది మేమే. నువ్వు పెట్టే కేసుల‌కు, నీతోపాటు నీకు పావులుగా మారిన అధికారుల‌కు ఇద్ద‌రికీ వార్నింగ్ ఇస్తున్నా.. వ‌డ్డీతో స‌హా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు విత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మ‌ర్చిపోవ‌ద్దు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

కరెడు రైతులకు సంబంధించి విచిత్రమైన విషయం..ఆశ్చ‌ర్యం క‌ల్పించేది ఏంటంటే..
రామ‌య్య‌పోర్టుకు ఆనుకుని ఇండోసోల్‌ కంపెనీకి అనుబంధ పరిశ్రమ ఏర్పాటుకు చేవూరులో 5000 ఎకరాలు రైతులను ఒప్పించి ఇప్పించి, రూ.417 కోట్లు వారికి ఇండోసోల్‌ కంపెనీ నుంచి ఇప్పించాం. అందులో 114 ఎక‌రాల్లో బిల్డింగ్‌లు క‌డుతున్నారు. 8 వేల ఉద్యోగాలు అక్క‌డ వ‌స్తున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. అక్క‌డి నుంచి వాళ్ల‌ను పొగ‌బెట్టి వెళ్లిపొమ్మ‌న‌ట్లుగా వాళ్ల కోసం సేక‌రించిన భూముల‌ను వాళ్ల‌కు ఇవ్వ‌కుండా వేరే వాళ్ల ఇస్తూ కరెడులో రెండు పంటలు పండే భూములు వీళ్లకు ఇస్తామని, అక్కడికి వెళ్లిపోమ్మంటున్నారు. 

ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా? పొగపెట్టేది. రూ.42 వేల కోట్ల పెట్టుబ‌డులు, 8 వేల మందికి ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటే మీరు చేస్తున్న‌ది ఏంటి? ప్రాజెక్టులు రావడానికి ప్రయత్నం చేస్తున్నారా?  పంపించడానికి ప్రయత్నిస్తున్నారా? ఇదే బీపీసీఎల్‌కు ల్యాండ్ ఇవ్వాల‌నుకుంటే వేరే ల్యాండ్ లేదా? అదే జిల్లాలోనే గవర్నమెంట్‌ ల్యాండ్‌ ఉంది. ఇదే కృష్ణ‌ప‌ట్నంలోనే ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి 10 వేల ఎకరాలు ఉంది. ఇవ్వ‌వ‌చ్చు క‌దా? ప్రకాశం జిల్లాలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అవి ఇవ్వకుండా ఇక్కడ ల్యాండ్‌ ఇచ్చి వీళ్లను కంట్రవర్సీ ఉన్న చోటికి పంపిస్తున్నారంటే..అస‌లు ఈయ‌న కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. 

ఈయన పరిశ్రమలు ప్రోత్సహించడం లేదు. పారిశ్రామిక వేత్తల‌ను బెదిరించి సొమ్ము చేసుకునేందుకు ఈయ‌న ఉన్నారు. ఈయన పుణ్యమా అని క‌డ‌ప జిల్లాలో కుమార మంగళం బిర్లా ను బెదిరించి ప‌నులు ఆపేశారు.  కర్నూలులో ఆల్ట్రా టెక్‌ ఫ్యాక్టరీ కడుతున్నారు .అక్కడ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి మనిషికి కాంట్రాక్ట్‌ ఇవ్వకపోతే పనులు జరగడం లేదు. దాల్మియా సిమెంట్ ప‌రిస్థితి అంతే. జిందాల్‌ వెనక్కి వెళ్లిపోయారు. అరబిందో వాళ్లు చంద్రబాబుకు నమస్కారం పెడుతున్నారు. కేవలం బెదిరించడం, వాళ్ల నుంచి బ్లాక్‌మెయిల్‌ చేసి సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ఉన్నారు. ఈయనకు పరిశ్రమలు తేవాలనే, దాని వ‌ల్ల ఉద్యోగాలు రావాల‌ని, ఈ ప్రాంతానికి మంచి చేయాల‌నే ఉద్దేశం చంద్ర‌బాబుకు ఎక్కడా లేదు. 

 

Back to Top