‘వెన్నుపోటుకు రెండేళ్లు’

శుక్రవారం (12వ తేదీ) నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు

‘డీఎస్సీ–2025’ లో అక్రమాలపైనా నిరసన

తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయని సీఎం చంద్రబాబు, ఈ రెండేళ్లలో ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైనంపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కార్యాచరణలో ప్రధానమైన కార్యక్రమం శుక్రవారం (12వ తేదీ) జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తారు.
    ఇందులో భాగంగా చంద్రబాబునాయుడుగారికి సంబంధించిన సూపర్‌సిక్స్‌తో సహా, మ్యానిఫెస్టో కాపీ.. ఇంకా పవన్‌కల్యాణ్, చంద్రబాబునాయుడు ఫొటోలతో సంతకాలు చేసి, ప్రతి ఇంటికి పంపించిన బాండ్ల కాపీలు.. చూపిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తారు. వాటితో పాటు, డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలు, అవకతవకలను ప్రస్తావిస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తారు.
    గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డీఎస్సీలో నియమాలు ఇష్టానుసారం మార్చి, కొత్తగా జీఓలు జారీ చేసి, స్పోర్ట్స్‌ కోటా పోస్టులు అడ్డగోలుగా భర్తీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అన్యాయానికి గురైన డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన చెందుతుండగా, డీఎస్సీ–2025పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వైయస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది.
    
ఆ నేపథ్యంలోనే శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన, ర్యాలీ కార్యక్రమంలో డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించాలని, పరీక్ష నిర్వహణ, ఉద్యోగాల భర్తీలో అక్రమాలు ఎత్తి చూపుతూ, ప్లకార్డులు ప్రదర్శించాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్దేశించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణుల పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Back to Top