తమ్ముడిని బంధించి.. చెల్లెళ్లను ముంచి ఆస్తులు కాజేశావ్

ఇతరుల కుటుంబాలపై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు

సొంత తమ్ముడు, చెల్లెళ్ల ఆస్తి వాటాలెక్కడ? 

లోకేష్ పేరిట ఎందుకు బదలాయించారు?

చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన సుధాకర్ బాబు

నీ సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయిని అరికట్టలేదు

ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావు

చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే టీ జే ఆర్ సుధాకర బాబు ఫైర్.

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా శాంతిభద్రతలను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ జే ఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుప్పం పర్యటనలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ పై చంద్రబాబు చేసిన వ్యక్తిగత, చౌకబారు విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎదుటివారి కుటుంబాలపై బురదజల్లే ముందు, కన్న తల్లిదండ్రులను దూరం పెట్టి, తోడబుట్టిన తమ్ముడు, చెల్లెళ్లకు ఆస్తి వాటాలు ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు తన చరిత్రను గుర్తుచేసుకోవాలని సూటిగా ప్రశ్నించారు. కేవలం తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైయస్.జగన్, వైయస్సార్సీపీపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

వైయస్.జగన్ పై వ్యక్తిగత దూషణలు.. బాధ్యత మరిచిన చంద్రబాబు!

40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే సీఎం చంద్రబాబు.. కుప్పం పర్యటనలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పై వ్యక్తిగత దూషణలు చేస్తూ అత్యంత చౌకబారు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా తానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిననే విషయాన్ని, శాంతిభద్రతలు తన చేతుల్లోనే ఉంటాయనే అథారిటీని చంద్రబాబు మర్చిపోయారు. గంజాయి బ్యాచ్, రౌడీ మూకలను అరికట్టలేక.. ఆ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైయస్.జగన్ కుటుంబంపైనా, వైయస్సార్సీపీ పైనా దురహంకారంతో మాట్లాడుతున్నారు.

చంద్రబాబుకు వైయస్సార్సీపీ సంధించిన 3 ప్రశ్నలు:

చంద్రబాబు తకన్న తల్లిదండ్రులను దూరం పెట్టింది నిజం కాదా? చంద్రబాబు నాయుడు తన తల్లిదండ్రులతో దిగిన ఫోటో కానీ, వారి పాదాలకు నమస్కరిస్తున్న ఫోటో కానీ ఉందా? పెళ్లై ఎన్టీఆర్ అల్లుడు అయ్యేనాటికి కన్నవారితో ఉన్నారా లేక హాస్టల్ లో ఉన్నారా? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు కదా, మరి మీతో మీ ఇంట్లో ఎందుకు ఉంచుకోలేదు?
సొంత తోడబుట్టిన వారితో కలిసి ఉన్న ఒక్క ఫోటో ఉందా? చంద్రబాబుకు తోడబుట్టిన తమ్ముడు రామ్మూర్తి నాయుడు, రాజేశ్వరి, హైమావతి అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వీరందరితో కలిసి చంద్రబాబు దిగిన ఒక్క ఫోటో అయినా ఉందా? ఎందుకు వారిని బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచారు?

ఆస్తుల పంపకాల్లో తమ్ముడు, చెల్లెళ్లకు గుండుసున్నా! 
చంద్రబాబు ననతండ్రి ఖర్జూరనాయుడు, అమ్మన్నమ్మల ఆస్తి విలువ ఎంత? అందులో రామ్మూర్తి నాయుడు, చెల్లెళ్ల వాటా ఎంత? హైదరాబాద్ లోని అమ్మన్నమ్మ ఆస్తిని తమ్ముడు, చెల్లెళ్లకు ఇవ్వకుండా వేలిముద్రలు వేయించుకుని లోకేష్ పేరు మీద ఎందుకు బదలాయించారు? మీ అఫిడివిట్ లో చూపిన రూ.1300 కోట్ల ఆస్తిలో, హెరిటేజ్ వ్యాపారంలో, అమరావతిలో కడుతున్న ఇంద్రభవనంలో మీ తమ్ముడు, చెల్లెళ్ల వాటా ఎంత?
తమ్ముడు రామ్మూర్తి నాయుడిని ఎందుకు బంధించారు? సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడిని చనిపోయే రోజు వరకు ఎందుకు గొలుసులతో బంధించి ఇంట్లో దాచిపెట్టారు? ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడే చంద్రబాబుకు ఈ నిజాలు చెప్పే ధైర్యం ఉందా?
వైయస్.జగన్ అంటే చంద్రబాబుకు అంత భయమెందుకు? అధికారిక సభల్లో పాలన గురించి మాట్లాడాల్సింది పోయి, ఉదయం లేచింది మొదలు చంద్రబాబు, మంత్రులు, డిప్యూటీ సీఎం, షాడో సీఎంల వరకు అందరూ ‘జగన్నామస్మరణ’ చేస్తున్నారు. నిత్యం వైయస్.జగన్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే పనిగా పెట్టుకున్నారు.

శాంతిభద్రతల వైఫల్యం.. పోలీసుల అండతోనే డ్రగ్స్ దందా!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సొంత నియోజకవర్గం కుప్పంలోనే గంజాయి, రౌడీ మూకలను అరికట్టలేకపోయిన చంద్రబాబుకు సీఎంగా కొనసాగే అర్హత లేదు, తక్షణమే రాజీనామా చేయాలి. పోలీసుల చేతిలో లాకప్ డెత్ కి గురైన కాపు యువకుడు సాయికృష్ణ మృతదేహం ఎక్కడుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సిఐ నాగరాజు పాత నేరస్థులతో కలిసి గంజాయి, డ్రగ్స్ దందాలు, సెటిల్మెంట్లు చేస్తుంటే ప్రశ్నించినందుకే సాయికృష్ణ, క్రాంతి కుమార్ ల లాకప్ డెత్ హత్యలు జరిగాయి. కోర్టుల ఉనికిని మర్చిపోయి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వం ఒక ‘హత్యారాజకీయాల పార్టీ’.

మహిళలపై వేధింపులు - వైఫల్యాల పాలన:

బీజేపీ, జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలతో అత్యంత నీచంగా ప్రవర్తించి అడ్డంగా దొరికినా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు.. 22-ఏ పేరుతో రైతులను నట్టేట ముంచారు. వైయస్.జగన్ హయాంలో తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్, సాంకేతికతనే వాడుకుంటూ వైయస్సార్సీపీపై అభాండాలు వేస్తున్నారు. పరిశ్రమలను మేం వెళ్లగొట్టలేదు.. రెండేళ్లుగా జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకుండా వేధిస్తూ, పనులు ఆపింది చంద్రబాబే.

జనసేన అల్లరి మూకలు పోలీసులపై దాడులు చేస్తుంటే, యూట్యూబర్ రావణ్ పై దాడులు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మౌనంగా చూస్తున్నారు. వ్యవహారం చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నట్టే కనిపించడం లేదు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పాలన వల్ల మామిడి, అరటి, వరి, టమోటా వంటి ఏ పంటకూ మద్దతు ధర లేదు. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి నిత్యం జగన్ జపం చేయడం మాని.. రైతులు, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని సుధాకర్ బాబు  డిమాండ్ చేశారు.

Back to Top