సౌత్‌ ఆఫ్రికాలో వైయ‌స్‌ఆర్ వర్ధంతి కార్యక్రమం

వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్‌ ఆఫ్రికా విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

జోహన్నెస్‌బర్గ్‌: సెప్టెంబర్‌ 2న మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్‌ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లో సేవా కార్యక్రమం నిర్వహించారు.
వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్‌ ఆఫ్రికా కన్వీనర్‌ విక్రమ్‌రెడ్డి పెట్లూరు ఆధ్వర్యంలో ఈడెన్‌వేల్‌లోని ది లిటిల్‌ ఈడెన్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన వారి సంక్షేమం, సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా భావం, మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను చాటుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అండగా నిలిచేలా కార్యక్రమాన్ని చేపట్టారు.

వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు, ఆయన సేవా స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్‌ ఆఫ్రికా ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలు నరసింహరెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్‌రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి ఏనుముల, హరీష్‌ గోరంట్ల, శ్రావణి పెట్లూరు, కరుణా బసిరెడ్డి, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top