రేపు వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు

 వెన్నుపోటుకు రెండేళ్లు పాల‌న‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా ర్యాలీలు

తాడేపల్లి: రేపు(శుక్రవారం) ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడిన ప్రతీ వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతామన్నారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. 

Back to Top