రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు కార్యాచరణపై టాస్క్‌ఫోర్స్ సమావేశం 

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన కీలక చర్చలు 

 సమావేశంలో పాల్గొన్న రాయ‌ల‌సీమ పార్టీ నేత‌లు

నెల్లూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సమావేశం నెల్లూరులో జరిగింది. రాయలసీమకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చే ఎత్తిపోతల పథకం అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. నెల్లూరు నగరంలోని డీఆర్ ఉత్తమ్ హోటల్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్‌ఫోర్స్ ప్రోగ్రాం కన్వీనర్ సాకే శైలజానాథ్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, టాస్క్‌ఫోర్స్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అమలుకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ ప్రణాళిక, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

Back to Top