వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బండి పుణ్యశీల నియామకం

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బండి పుణ్యశీలను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు.

అదేవిధంగా పార్టీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీలుగా నంద్యాల జిల్లాకు చెందిన అకీమ్‌ హనుమంతరెడ్డి, మద్దిరెడ్డి ఓంకారేశ్వర్‌రెడ్డి, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన నారాయణరెడ్డి, రామ్మూర్తిరెడ్డిలను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం అధికారిక ప్రకటనలు విడుదలయ్యాయి.

పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా స్పందించడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులకు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాల సాధనకు వారు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించాయి.
 

Back to Top