అనంతపురం: ఈ నెల 18న తాడిపత్రిలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో `బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ` కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. `రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వాస్తవానికి 15న ఈ సమావేశం ఏర్పాటు చేసుకోగా మంత్రుల పర్యటన కారణంగా వాయిదా వేసుకోవాలని తాడిపత్రి ఏఎస్పీ సూచించారని తెలిపారు. దీంతో సమావేశాన్ని 18వ తేదీకి వాయిదా వేసినట్లు పెద్దారెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు సూచించింది. కానీ, అనంతపురం పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నెల 5వ తేదీ ఎస్పీ జగదీష్‌కు లేఖ రాశారు.