తాడేపల్లి: తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం భైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావు మృత్యువాత పడడంపై వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.