గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి, యువ‌త ర్యాలీ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ 

గుంటూరు:  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 28న త‌ల‌పెట్టిన విద్యార్ధి, యువ‌త ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, గుంటూరు నగర అధ్యక్షుడు రవి, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గంటి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ, గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు జగదీష్, గుంటూరు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు కోటి, యువజన విభాగం నాయకుడు అనిల్‌తో పాటు గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం నాయకులు మస్తాన్, సాజిద్, అరుణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Back to Top