చిన్నారి బాబుకు వైయ‌స్ జ‌గ‌న్ నామ‌క‌ర‌ణం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత  వైయస్‌ జగన్‌ను కలిసి తమ కుమారుడికి నామకరణం చేయాలని గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌ కొండాబత్తుల గిరి, జ్యోతి దంపతులు కోరారు. వారి కోరిక మేర‌కు చిన్నారి బాబుకు కెవిన్‌ అనే పేరు పెట్టి వైయస్‌ జగన్ లాలించారు. తమ కుమారుడికి వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు గిరి దంప‌తులు సంతోషం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ తరుపున సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాననే కారణంతో ఇప్పటికి మూడు సార్లు తనను ద్వారకా తిరుమల పోలీసులు స్టేషన్‌కు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని ఈ సంద‌ర్భంగా గిరి వైయస్‌ జగన్ దృష్టికి తెచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అండగా ఉంటుందని గిరికి వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

Back to Top