తాడేపల్లి: మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా , ఆయన ప్రజాసేవా తపనకు స్ఫూర్తిగా అడిలైడ్ నగరంలో డాక్టర్ వైయస్ఆర్ ఫౌండేషన్ ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్, వైయస్ జగన్ అభిమానులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేసి ప్రజాసేవలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సెప్టెంబర్2వ తేదీని పురస్కరించుకొని ఆస్ట్రేలియా దేశంలో ముందస్తుగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించి, మహానేతకు ఘన నివాళులర్పించారు. ఫౌండేషన్ కమిటీ సభ్యులు వంశీ బొంతు, రామ్ మోహన్ రెడ్డి మునగల, విజయ్ రెడ్డి వంగా, కిశోర్ అనుమోలు, నవీన్ రెడ్డి, వర్ధన్ రెడ్డి సమన్వయంతో ఈ శిబిరం విజయవంతంగా జరిగింది. మురహరి రెడ్డి, డాక్టర్ అరవింద్, మనోజ్, పృధ్వి, ప్రవీణ్ మునగలతో పాటు పలువురు వైయస్ఆర్ అభిమానులు రక్తదానం చేసి మహానేతకు నివాళి అర్పించారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ అలూరి సాంబశివ రెడ్డి ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని మహానేత సేవలను కొనియాడారు. రక్తదానం చేసిన రక్తదాతలను వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు కడప రత్నాకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయన సూచించారు.