రైతుల‌ను విస్మ‌రించిన కూట‌మి ప్ర‌భుత్వం 

వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి

క‌మ‌లాపురం:  కూట‌మి ప్ర‌భుత్వం రైతుల‌ను విస్మ‌రించింద‌ని వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి మండిప‌డ్డారు. శ‌నివారం కమలాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. `వర్షాభావ పరిస్థితులు, వరదలు, భారీ వర్షాల కార‌ణంగా రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఎదురొడ్డి సాగుచేసిన ఉల్లి పంట ధరలు దళారులు అడిగిన రేటుకు విక్రయించాల్సి వస్తుంది.   రాష్ట్రంలో ఉల్లి రైతులు కుదేలయ్యారు. ఉల్లి రైతులను కష్టాలు వెంటడుతున్నా..ఈ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది.  .  యూరియా దొరకక రైతులు అగచాట్లు పడుతున్నారు.  రైతాంగ సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు` అని పి రవీంద్రనాథ్ రెడ్డి ఆక్షేపించారు.

రామసుబ్బారెడ్డి కుటుంబానికి పరామర్శ... 
అప్పాయపల్లిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మారుజోళ్ల రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. మృతికి గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకొని, కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు.  

  • కమలాపురం వైయ‌స్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు  గంగాధర్ రెడ్డి సతీమణి, 15 వ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణమ్మ ఇటీవ‌ల కాలు విరిగి చికిత్స అనంత‌రం విశ్రాంతి తీసుకుంటున్నారు. విష‌యం తెలుసుకున్న ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి గంగాధ‌ర్‌రెడ్డి ఇంటికి వెళ్లి సంధ్యారాణ‌మ్మ‌ను ప‌రామ‌ర్శించారు.  అలాగే ఇటీవల కాలు ఎముక విరిగి చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకురాలు సావిత్రమ్మను ర‌వీంద్రనాథ్‌రెడ్డి ప‌రామ‌ర్శించి, యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

Back to Top