వైయ‌స్ఆర్ రుణం తీర్చుకోలేం

వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి

ఆస్ట్రేలియాలో వైయ‌స్ఆర్ ముంద‌స్తు వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

తాడేప‌ల్లి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రుణం తీర్చుకోలేనిద‌ని  వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వ‌చ్చే నెల 2వ తేదీ వైయ‌స్ఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆస్ట్రేలియా, మెల్బోర్న్‌లో ముంద‌స్తు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నాయ‌కులు నివాళుల‌ర్పించారు.   వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న‌ను ఎన్ఆర్ఐలు గుర్తు చేసుకొని, ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్చువ‌ల్‌గా వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ నైరుతి రెడ్డి పాల్గొని వైయ‌స్ఆర్ సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.  డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో అపారమైన స్థానం కలిగి ఉన్నారని, ఆయన చేసిన అద్భుతమైన సేవలు, ప్రజల కష్టాలకు ఇచ్చిన పరిష్కారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయ‌న్నారు. వైయ‌స్ఆర్ ఆశ‌య సాధ‌న‌కు ఆయ‌న త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృషి చేస్తున్నార‌ని, అంద‌రం ఆయ‌న బాట‌లో న‌డిచి ప్ర‌జ‌ల‌కు మంచి చేద్దామ‌ని పిలుపునిచ్చారు. రాజ‌న్న రాజ్యాన్ని మ‌ళ్లీ తెచ్చుకుందామ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.  కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆస్ట్రేలియా విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ భరత్, కోర్ టీమ్ సభ్యులు బ్రహ్మ రెడ్డి, రామాంజి, సురేష్ రెడ్డి, సతీష్, పవన్, బాషా, తేరా జయవర్ధన్ రెడ్డి, దశరథ్ రెడ్డి,  శ్రీధర్, త‌దిత‌రులు పాల్గొని తామంతా వైయ‌స్ జ‌గ‌న్ వెంటే ఉంటామ‌ని, జోహార్ వైయ‌స్ఆర్ అంటూ నిన‌దించారు.

Back to Top