తాడేపల్లి: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి పిలుపు మేరకు శుక్రవారం అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు కలెక్టరేట్లకు తరలివెళ్లి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలకు వినతిపత్రాలు అందజేశారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు, నిబంధనలు, జీవోల మార్పులు సహా పార్టీ లేవనెత్తుతున్న ఆరోపణలన్నింటిపైనా స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీతో పాటు విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను కూడా వైయస్ఆర్‌సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. - శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పార్టీ నేతలు జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, అందవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, పినిమింటి సాయి, చల్ల రవి, దుంపల లక్ష్మణరావు, గేదెల పురుషోత్తం, మార్పు పృథ్వీరాజ్, ముత్త విజయ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్.. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అమలు చేయాలని కోరారు. - అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పాడేరు ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పార్టీ నేతలు కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణ తదితరులు పాల్గొన్నారు. మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా సహా జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను విడుదల చేసి, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే అమలు చేయాలని కోరారు. - పార్వతీపురం మన్యం పార్వతీపురంలో వైయస్ఆర్‌సీపీ నేతలు జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిశీలకుడు శరగడం చిన్న అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ మంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పల్లా అనంత్ నాయుడు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బోతాడ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ..డీఎస్సీ ప్రశ్నపత్రాల వ్యవహారం, స్పోర్ట్స్ కోటా నియామకాలు, నిబంధనల మార్పులపై అనేక అనుమానాలు ఉన్నాయని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం నియామకాలు పారదర్శకంగా జరిగాయని చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. లోకేష్ రాజీనామా చేయడంతో పాటు విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు, నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. - కాకినాడ కాకినాడలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీత, పెద్దాపురం కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, జిల్లా పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, నగర పార్టీ అధ్యక్షుడు సుంకర శివప్రసన్న, రాజిరెడ్డి దీప్తి తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భారత్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ..డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని అమలు చేయాలని కోరారు. - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరి, మాజీ ఎంపీ చింతా అనురాధ, గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాశ్, జిన్నూరి బాబీ తదితరులు పాల్గొన్నారు. చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. - తూర్పుగోదావరి రాజమహేంద్రవరంలో జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, నాగులపల్లి ధనలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు దూలం వెంకన్నబాబు, కర్రి పాపారాయుడు, సబ్బళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా నిబంధనల మార్పులు సహా మొత్తం నియామక ప్రక్రియపై విచారణ జరిపించాలని, లోకేష్ రాజీనామా చేయాలని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలతో పాటు నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. - పశ్చిమగోదావరి భీమవరంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తాడేపల్లిగూడెం వైయస్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామ్‌తో పాటు పార్టీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డీ రఘురామ్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై పారదర్శక విచారణ జరిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, యువతకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. - ఏలూరు ఏలూరులో జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పుప్పాల వాసుబాబు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ..డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, పరీక్ష లీకేజీలు, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను చెల్లించి నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని కోరారు. - కృష్ణా కృష్ణా జిల్లాలో జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పార్టీ నేతలు జాయింట్ కలెక్టర్ నవీన్‌కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు సింహాద్రి రమేష్‌బాబు, ఉప్పాల రాము, దేవభక్తుని చక్రవర్తి, వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. పేర్ని నాని మాట్లాడుతూ ..జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఉద్యోగం రాక కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అడ్డదారిలో వచ్చిన కూటమి కార్యకర్తలకు మాత్రం ఉద్యోగాలు పంచిపెట్టడం అత్యంత దారుణం. మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి, నిరుద్యోగులకు ఇచ్చిన భృతి హామీని అమలు చేయాలని కోరారు. - ఎన్టీఆర్ విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, స్వామిదాస్, ఎమ్మెల్సీ రుహుళ్ల, తన్నీరు నాగేశ్వరరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. - గుంటూరు గుంటూరులో జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అన్నాబత్తుని శివకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ నూరి ఫాతిమా, వనమా బాల వజ్రపుబాబు తదితరులు పాల్గొన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీగా మారిందన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల కోసం నిబంధనలు, జీవోలు ఎందుకు మార్చారో లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చల పేరుతో అసలు అంశాన్ని పక్కదారి పట్టించకుండా ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. - పల్నాడు నరసరావుపేటలో పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకుడు పూనూరు గౌతమ్‌రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయడంతో పాటు విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను విడుదల చేసి నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. - ప్రకాశం ఒంగోలులో జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుందూరు నాగార్జునరెడ్డి, చుండూరి రవిబాబు, డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్, కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అదెన్న తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వీటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నెల్లూరులో వైయస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నిబంధనలను ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని, నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. - వైయస్ఆర్ కడప కడపలో జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో మల్లికార్జునుడుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై ఆధారాలు బయటకు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు సహా మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. - అన్నమయ్య మదనపల్లిలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి, జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి ఇన్‌ఛార్జ్ నిస్సార్ అహ్మద్, అనీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, పరీక్షల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను చెల్లించి నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. - అనంతపురం అనంతపురంలో జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ మెరిట్ లిస్ట్‌తో పాటు స్పోర్ట్స్ కోటా నియామకాల్లో బేరసారాలు జరిగినట్లు పేర్కొంటున్న వీడియోతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా అందజేశారు. నరేష్‌రెడ్డి, శైలజానాథ్, విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నైరుతిరెడ్డి, కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో అర్హులకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్‌ను బర్తరఫ్ చేయాలని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను విడుదల చేయాలని, ఎన్నికల హామీ ప్రకారం గడిచిన 25 నెలలకు ఒక్కో నిరుద్యోగికి రూ.75 వేల భృతి చెల్లించాలని కోరారు. ఆగస్టు 3 నుంచి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు, రిలే దీక్షలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. - శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి, మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త లక్కప్పతో పాటు ఇతర వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. - కర్నూలు కర్నూలులో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, మాజీ ఎంపీ బుట్టా రేణుక, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, కర్నూలు మాజీ మేయర్ బి.వై. రామయ్య, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, కర్నూలు నగర పార్టీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను విడుదల చేసి, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. - నంద్యాల నంద్యాలలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, కాటసాని తిరుపాల్‌రెడ్డి, గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్‌బాబు, సూర్యనారాయణరెడ్డి, సుమంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గుండం నాగేశ్వర్‌రెడ్డి, సురేష్, యునుస్, సద్దల చంద్రశేఖర్‌రెడ్డి, మధుమోహన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, శశికళారెడ్డి తదితర పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. - తిరుపతి తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ మేయర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. - చిత్తూరు చిత్తూరు కలెక్టరేట్‌లో వైయస్ఆర్‌సీపీ నేతలు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ కాస్తా దగా డీఎస్సీగా మారిందన్నారు. డీఎస్సీలో అన్యాయం జరిగిందంటూ నిరుద్యోగ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు వివరించారని గుర్తుచేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.