శ్రీకాకుళం: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, యువ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, పినిమింటి సాయి, చల్ల రవి, దుంపల లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మార్పు పృథ్వీరాజ్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ముత్త విజయ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు బుద్దల రాజశేఖర్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాగోటి భరత్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి పాగోటి గోవింద్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి కనపల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.