నెల్లూరు జిల్లా: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా వైయస్ఆర్‌సీపీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డు తగిలారు. కావలి కూటమి ఎమ్మెల్యే వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి నిప్పు,మగాడు కావలి కి రండి చూసుకుందాం అంటూ సవాల్ చేశారు. ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించిన వైయస్ఆర్‌సీపీ నేతలు మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సహా పలువురు కావలి వెళ్లేందుకు సిద్ధం కాగా వారిని అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. కావలి మాజీ ఎమ్మెల్యే ఇంటిని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భయంతో పోలీసులు వలయం లో దాక్కున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి బలమైన నాయకుడు అని మరోసారి నిరూపితమైంది.